ఓటీటీలో వచ్చే కంటెంట్‌లో ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్స్‌కు అంతా అట్రాక్ట్ అవుతుంటారి. ఎంత డిఫరెంట్‌గా ఈ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తే అవి అంతగా క్లిక్ అవుతాయి. అయితే, తాజాగా ఓటీటీలోకి నయా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్

ఇలా రాగానే ఆ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 9.9 రేటింగ్ రావడం ఓటీటీ ఆడియెన్స్‌కు ఆశ్చర్యం కలిగిస్తోంది. రేటింగ్‌తో క్రేజ్ తెచ్చుకున్న ఆ వెబ్ సిరీస్ పేరు రాక్షస (Raakshasa). ఇది కన్నడ భాషలో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌లో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. మయూరి క్యాతరి హీరోకు భార్యగా నటించింది. ఈ ఇద్దరితోపాటు రాక్షస ఓటీటీ సిరీస్‌లో అప్పన్న రామదుర్గ, అవినాష్, జహంగిర్ ఎమ్ఎస్, అభిజిత్, హులుగప్ప కత్తిమని, మహాదేవ్ హడాపద్, సుష్మిత జగప్ప తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
25 నిమిషాలు, 7 ఎపిసోడ్స్
రాక్షస వెబ్ సిరీస్‌కు సుహాన్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కన్నడ నిర్మాత తరుణ్ సుధీర్ రాక్షస వెబ్ సిరీస్‌ను నిర్మించారు. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో ఏడు ఎపిసోడ్స్ ఉన్న రాక్షస వెబ్ సిరీస్ ఒక మొసలి, ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ సాగుతుంది.
సిరీస్‌లో జరిగే హత్యలను సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా, లేదా మొసలి చంపుతుందా అనే పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక్కో సమయంలో మొసలే సీరియల్ కిల్లర్ అనేలా కథనం సాగుతుంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లలో నేరస్థుడిని పట్టుకోవడం ఒక ఎత్తైతే, ఆ నేరం వెనుక ఉన్న మానసిక సంఘర్షణను ఆవిష్కరించడం మరో ఎత్తు.
ఎస్సైకి తలనొప్పిగా
రాక్షస సరిగ్గా ఇదే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చంపేది మనుషులా, మొసల అనే విషయం ఎస్సై హనుమప్పకు తలనొప్పిగా మారుతుంది. ఈ కథ అంతా నార్త్ కర్ణాటకలోని సౌదత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంటుంది.
{{/usCountry}}రాక్షస సరిగ్గా ఇదే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చంపేది మనుషులా, మొసల అనే విషయం ఎస్సై హనుమప్పకు తలనొప్పిగా మారుతుంది. ఈ కథ అంతా నార్త్ కర్ణాటకలోని సౌదత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంటుంది.
{{/usCountry}}ఓ పండుగ సమయంలో నది ఒడ్డున మనిషి శరీర భాగాలు పోలీసులకు లభిస్తాయి. అతన్ని చంపింది మొసలే అని ప్రజలు భయపడుతుంటారు. అప్పటికే సౌదత్తి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసులు చాలా వరకు నమోదు అయి ఉంటాయి. మరి వారంతా ఏమయ్యారు?, మొసలికి బలయ్యారా? లేదా ఇంకేదైనా మిస్టరీ ఉందా? అనేది ఎస్సై హనుమప్ప తెలుసుకున్నాడా అనే అంశాలతో సాగే ఓటీటీ సిరీస్ రాక్షస.
జీ5 ఓటీటీలో
ఇలా ఉత్కంఠం రేపే రాక్షస ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 20 అంటే నిన్నటి నుంచి జీ5లో రాక్షస ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే మంచి క్రేజ్ తెచ్చుకున్న రాక్షస సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో సుమారు 18 వేల మంది వరకు యూజర్స్ 9.9 రేటింగ్ ఇచ్చి టాప్‌లో ఉంచారు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు జీ5 ఓటీటీ సిరీస్ రాక్షసపై లుక్కేయొచ్చు.