...
...
Next Story

Song: నీ పరిచయం సాంగ్ మా సినిమాకు పిల్లర్ లాంటిది, అనూప్, చిన్మయికి థ్యాంక్స్: టార్టాయిస్ నిర్మాత విజయ్ చౌదరి కామెంట్స్

Tortoise Nee Parichayam Song Launch Event: తెలుగులో వస్తోన్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టార్టాయిస్. రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా నుంచి నీ పరిచయం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టార్టాయిస్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత విజయ్ చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 5, 2026, 21:11:59 IST
Advertisement

Tortoise Nee Parichayam Song Launch Event: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్". ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో

నీ పరిచయం సాంగ్ మా సినిమాకు పిల్లర్ లాంటిది, అనూప్, చిన్మయికి థ్యాంక్స్: టార్టాయిస్ నిర్మాత విజయ్ చౌదరి కామెంట్స్
నీ పరిచయం సాంగ్ మా సినిమాకు పిల్లర్ లాంటిది, అనూప్, చిన్మయికి థ్యాంక్స్: టార్టాయిస్ నిర్మాత విజయ్ చౌదరి కామెంట్స్

"టార్టాయిస్" సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ సినిమా. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 5) టార్టాయిస్ చిత్రంలోని 'నీ పరిచయం..' పాటను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

చంద్రబోస్ కామెంట్స్

ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. "ప్రేమ, ఆర్తి, అక్కెరతో కూడుకున్న పాట ఇది. ఈ పాటను అత్యద్భుతంగా కంపోజ్ చేసిన అనూప్ గారికి, అంతే అద్భుతంగా పాడిన చిన్మయి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా" అని తెలిపారు.

"ఈ చిత్ర దర్శకుడు రిత్విక్ కుమార్, నిర్మాతలు విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబుకు నా అభినందనలు చెబుతున్నా. ఈ పాట మీ అందరినీ అలరిస్తుంది, ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుంది" అని చంద్రబోస్ ధీమా వ్యక్తం చేశారు.

ఎమోషనల్‌గా సాగే పాట

"నాతో పాటు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన మిత్రులు శశి, రాంబాబు నాకు చాలా సపోర్ట్ అందించారు. ఈ పాటలో రాజ్ తరుణ్, అమృత పర్ ఫార్మెన్స్ ఆకర్షణగా నిలుస్తుంది. మా చిత్రాన్ని బడ్జెట్‌లో చెప్పిన డేట్స్‌లో ఎంతో క్లారిటీగా మా డైరెక్టర్ రిత్విక్ గారు చేశారు. త్వరలోనే మా మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం" అని నిర్మాత విజయ్ చౌదరి వెల్లడించారు.

రాత్రిళ్లు, వర్షం పడుతున్నప్పుడు

మరో ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల మాట్లాడుతూ.. "మా మూవీని అనుకున్న టైమ్‌కు ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేశాం. అందుకు మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ చిత్రానికి రాత్రిళ్లు, వర్షం పడుతున్నప్పుడు, చలిలో ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు వచ్చిన మా హీరో రాజ్ తరుణ్‌కు థ్యాంక్స్. ఈ పాట ఇంత బాగా వచ్చేందుకు అనూప్, చిన్మయి గారే కారణం. మా మూవీకి మెయిన్ పిల్లర్ మా డైరెక్టర్ రిత్విక్. మా మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది" అని పేర్కొన్నారు.

ఇంకో నిర్మాత రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ.. "మా సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టపడి నిర్మించాం. ఈ పాట మంచి లవ్ ఫీల్‌తో సాగుతూ మీరు రిపీటెడ్‌గా వినేలా చేస్తుంది. త్వరలోనే మా చిత్ర రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం. మా హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ అమృత, అవసరాల శ్రీనివాస్, ధన్య... ఇలా ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా" అని చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe