...
...
Next Story

OTT: ఓటీటీ తెలుగు సిరీస్‌కు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్- అప్పుడు నేనెందుకు గుర్తు రాలేదో తెలియదన్న రాజీవ్ కనకాల

Rajeev Kanakala On Daughter Of Prasad Rao Kanabadutaledu OTT Streaming Minutes: రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ సాధించిన సందర్భంగా రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Mar 6, 2026, 14:05:23 IST
Advertisement

ఓటీటీలో తెలుగు సిరీస్ వారం రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి దూసుకుపోతోంది. ఈ సిరీసే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఈ ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయ భాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు.

జీ5 ఓటీటీ తెలుగు నిర్మాణం

ఓటీటీ తెలుగు సిరీస్‌కు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్- అప్పుడు నేనెందుకు గుర్తు రాలేదో తెలియదన్న రాజీవ్ కనకాల
ఓటీటీ తెలుగు సిరీస్‌కు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్- అప్పుడు నేనెందుకు గుర్తు రాలేదో తెలియదన్న రాజీవ్ కనకాల

ఈ వెబ్ సిరీస్‌ను జీ5 ఓటీటీ తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.

ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన ఈ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం (మార్చి 5) నాడు ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అంటే

ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. "డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ సిరీస్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందరి ఎఫర్ట్‌తోనే ఇదంతా సాధ్యమైంది" అని అన్నారు.

"రెబెకా పాత్రలో ఉదయభాను ఎలా ఉంటారో అని అనుకున్నాను. కానీ, ఆమె ఎంతో డైనమిక్‌గా, పవర్ ఫుల్‌గా అనిపించారు. ఈ ఓటీటీ సిరీస్ చూసిన వారంతా కూడా కృష్ణ గారు రాసిన కథ, తీసిన విధానం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. మా అందరికీ ఇంత పేరు తీసుకు వచ్చేలా సిరీస్‌ను తీసిన కృష్ణ గారికి థాంక్స్" అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

"సిద్దు, కిరణ్మయి, శ్వేత ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఇలాంటి మంచి సిరీస్‌లో భాగమవ్వడం నా అదృష్టం. మహేష్ మా అందరినీ చక్కగా చూపించారు. ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ చూడాలి. సిరీస్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్" అని టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల తన స్పీచ్ ముగించారు.

కమ్యూనికేషన్ గ్యాప్ చూపేలా

నిర్మాత శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ .. "‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ని ప్రతీ ఒక్కరూ చూడాలి. ప్రస్తుత తరంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను చూపేలా మా దర్శకుడు కృష్ణ మంచి కథను తీసుకు వచ్చారు. జీ, కృష్ణ గారు, నేను కలిస్తేనే ఈ సక్సెస్ వచ్చింది. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది" అని అన్నారు.

"ఇందులోని ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అను మేడం గారు నాకు ఈ కెరీర్‌ను ఇచ్చారు. ఆమె గురించి ఒకనాడు నేను కచ్చితంగా మాట్లాడతాను. సిద్దు, కిరణ్మయి, శ్వేత గారు మాకెంతో సపోర్ట్‌గా ఉంటారు. మా ఓటీటీ సిరీస్‌ను చూసి ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని ఓటీటీ సిరీస్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ వెంకట్ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks