తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. రీసెంట్‌గా టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వార్‌పై ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, తన కామెంట్లపై ఎప్పుడు వివరణ ఇచ్చుకోని ఆర్జీవీ తాజాగా క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
బిగ్గెస్ట్ బాక్సాఫీస్ పోటీ

మార్చి 19న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ పోటీ జరగనుంది. అందుకు కారణం ధురంధర్ 2, టాక్సిక్ వంటి భారీ సినిమాలు అదే రోజున విడుదల కావడం. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వార్‌పై గత కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు.
రీసెంట్‌గా నిన్న (ఫిబ్రవరి 22) ఆదివారం రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీపై కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటల్లో దాదాపుగా ధురంధర్ 2 సినిమాను పొగుడుతున్నట్లుగానే ఉంది. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ఓరి మూర్ఖుల్లారా
దీంతో ఇప్పుడు ఆ కామెంట్లపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ వేశారు రామ్ గోపాల్ వర్మ. "నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోలని ఓరి మూర్ఖుల్లారా.. మీకోసమే ఈ క్లారిటీ ఇస్తున్నాను. ఈ రెండు సినిమాల (ధురంధర్ 2, టాక్సిక్) రిలీజ్ సందర్భంగా నేను చెప్పింది కేవలం సినిమా శైలిల గురించి మాత్రమే తప్పా ఏదో ఒక ఫిల్మ్ గురించి కాదు" అని ఆర్జీవీ రాసుకొచ్చారు.
పాత ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. గత ట్వీట్లో రామ్ గోపాల్ వర్మ "భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక వింత యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో కేజీఎఫ్ ’ సాధించిన భారీ వసూళ్లు ధురంధర్ ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు ధురంధర్ 2 అనే డేవిడ్ ముందు టాక్సిక్ అనే కొత్త గోలియత్ నిలబడింది" అని తెలిపారు.
ఒక్క నటుడినే దేవుడిలా
{{/usCountry}}పాత ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. గత ట్వీట్లో రామ్ గోపాల్ వర్మ "భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక వింత యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో కేజీఎఫ్ ’ సాధించిన భారీ వసూళ్లు ధురంధర్ ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు ధురంధర్ 2 అనే డేవిడ్ ముందు టాక్సిక్ అనే కొత్త గోలియత్ నిలబడింది" అని తెలిపారు.
ఒక్క నటుడినే దేవుడిలా
{{/usCountry}}"ధురంధర్ మేకర్స్ ప్రేక్షకుల తెలివితేటలను గౌరవిస్తారు. కానీ, టాక్సిక్ మేకర్స్ మాత్రం ప్రేక్షకులు మూర్ఖులని భ్రమపడతారు. కేవలం ఒక్క నటుడిని దేవుడిలా చూపించడానికి రూ. 700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రను మనిషిలా చూపించడానికి రూ. 130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప" అంటూ రాసుకొచ్చారు ఆర్జీవీ.
ఇదిలా ఉంటే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్ నటించిన సినిమానే టాక్సిక్. నయనతార, హ్యూమా ఖురేషీ, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో బ్రూటల్ వయోలెన్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి.
ఒకేరోజు పోటీ
మరోవైపు ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ధురంధర్ సినిమా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా ధురంధర్ 2 లేదా ధురంధర్ ది రివేంజ్ తెరకెక్కింది. బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేరోజు తలపడనుండటంతో ఆర్జీవీ వరుసగా ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు.