టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీపై వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధురంధర్ ది రివేంజ్ భారతీయ సినిమాకు కొత్త బాటలు చూపిందని, ఒకరకంగా ఇది తనను తాను రీ-బూట్ చేసుకునేలా చేసిందని ఆర్జీవీ పేర్కొన్నారు.
"నా పాత పాఠాలు పనికిరావు.. కొత్త స్కూల్లో చేరాల్సిందే"

తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. "ధురంధర్ 2 చూసిన తర్వాత నా పాత సినిమాలన్నీ ఏమీ కావనిపించింది. ఇప్పటి వరకు నా సినిమాలకు 'ది గాడ్‌ఫాదర్' ఒక బెంచ్‌మార్క్. కానీ ఈ సినిమా చూశాక అది 'గాడ్‌ఫాదర్‌కే గాడ్‌ఫాదర్' అని అర్థమైంది" అని అన్నారు.
"మేకింగ్, కథ చెప్పే విధానం, క్యారెక్టర్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ప్రతి విషయంలో ఆదిత్య ధర్ అద్భుతాలు చేశారు. అందుకే పాత స్కూల్ పాఠాలను వదిలేసి, ఆదిత్య ధర్ కొత్త స్కూల్లో చేరాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే మనం అప్‌డేటెడ్‌గా ఉండగలం" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
సంచలనంగా మారనున్న ‘సిండికేట్’
తన కొత్త ప్రాజెక్ట్ 'సిండికేట్' గురించి ప్రస్తావిస్తూ.. "ఒక్క రోజులో దేశంలోని శాంతి భద్రతలు మొత్తం కుప్పకూలిపోతే పరిస్థితి ఏంటి? అనే పాయింట్ మీద ఈ సినిమా (సిండికేట్) ఉంటుంది. ఇందులో దెయ్యాలు ఉండవు కానీ, మనుషుల మెదడులోని భయంకరమైన ఆలోచనలే హారర్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి" అని ఆర్జీవీ పేర్కొన్నారు.
శక్తివంతమైన వ్యవస్థ పుట్టుక గురించి
"దేశ ఉనికికే సవాలు విసిరే ఒక శక్తివంతమైన వ్యవస్థ పుట్టుక గురించి ఇందులో చూపిస్తున్నాను. ధురంధర్ 2 తర్వాత రాబోయే కాలానికి తగినట్టుగా నా 'సిండికేట్' ఉంటుంది" అని రామ్ గోపాల్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.
మేకర్స్‌కు హెచ్చరిక!
{{/usCountry}}"దేశ ఉనికికే సవాలు విసిరే ఒక శక్తివంతమైన వ్యవస్థ పుట్టుక గురించి ఇందులో చూపిస్తున్నాను. ధురంధర్ 2 తర్వాత రాబోయే కాలానికి తగినట్టుగా నా 'సిండికేట్' ఉంటుంది" అని రామ్ గోపాల్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.
మేకర్స్‌కు హెచ్చరిక!
{{/usCountry}}సినిమా రంగంలో ఉన్న దర్శకులు, నటులు, రచయితలు తమ ఈగోలను పక్కన పెట్టి ‘ధురంధర్ 2’ మీద ఒక అకడమిక్ రీసెర్చ్ చేయాలని వర్మ సూచించారు. "మార్చి 19, 2026న పాత సినిమా సూత్రాలన్నీ చనిపోయాయి. ఇంకా ఆ పాత పద్ధతులనే పట్టుకుని వేలాడితే.. మీ కెరీర్ కూడా కనుమరుగవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిందే" అని ఆర్జీవీ హెచ్చరించారు.
ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల చుట్టూ
కరాచీలోని ల్యారీ ప్రాంతం నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల చుట్టూ తిరిగే ‘ధురంధర్ 2’ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. రణ్‌వీర్‌తోపాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ల నటనకు వర్మ ఫిదా అయిపోయారు.