Deepika Padukone Announces Second Pregnancy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి తల్లి కాబోతుంది. తాజాగా తన రెండో ప్రెగ్నెన్సీని అత్యంత క్యూట్‌గా ప్రకటించింది రణ్‌వీర్ సింగ్-దీపిక పదుకొణె జంట. ఆదివారం (ఏప్రిల్ 19) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అరుదైన చిత్రాన్ని షేర్ చేస్తూ అభిమానులకు తీపి కబురు చెప్పింది దీపిక.
'దువా' చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్

ఆ ఫొటోలో కూతురు 'దువా' చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. అందులో రెండు స్పష్టమైన పింక్ లైన్లు కనిపిస్తున్నాయి. అంటే దువా ఇప్పుడు 'అక్క' కాబోతుందన్నమాట. ఈ ఫొటోలో దీపికా, రణ్‌వీర్ చేతులు తమ కూతురిని అక్కున చేర్చుకున్నట్లుగా ఉండటం చూస్తుంటే ఆ కుటుంబంలో సంతోషం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ఆర్భాటం లేకుండా కేవలం 'దిష్టి చుక్క' (Evil Eye) ఎమోజీలతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.
బాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న అభినందనలు
కూతురు దువా పదుకొణెతో తన రెండో ప్రెగ్నెన్సీ న్యూస్‌ను వినూత్నంగా, క్యూట్‌గా ప్రకటించారు దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ జంట. ఈ వార్త బయటకు రాగానే నెట్టింట అభిమానుల కోలాహలం మొదలైంది. టాలీవుడ్ నుంచి సమంత రూత్ ప్రభు రెడ్ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను చాటగా, పరిణీతి చోప్రా తదితర సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
"దువాకు తోడు దొరుకుతోంది", "మరో మినీ దీపికా రాబోతుందా?" అంటూ అభిమానులు క్రేజీ కామెంట్లతో విషెస్ తెలుపుతున్నారు. "కొన్ని వార్తలు వింటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది.. ఇది అలాంటిదే" అని ఒక అభిమాని రాసుకొచ్చారు.
ఇటలీలో వివాహం.. దువాతో మొదలైన ప్రయాణం
దీపికా, రణ్‌వీర్ కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి 2018 నవంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత ముంబై, బెంగళూరుల్లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్లు నిర్వహించారు.
{{/usCountry}}దీపికా, రణ్‌వీర్ కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి 2018 నవంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత ముంబై, బెంగళూరుల్లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్లు నిర్వహించారు.
{{/usCountry}}2024 సెప్టెంబర్‌లో ఈ దంపతులకు మొదటి సంతానంగా 'దువా పదుకొణె' జన్మించింది. తమ ప్రార్థనలకు దేవుడు ఇచ్చిన సమాధానం (Dua) కాబట్టే ఆ పేరు పెట్టినట్లు వారు గతంలో వెల్లడించారు. గతేడాది దీపావళి సందర్భంగా దువా ముఖాన్ని పరిచయం చేయగా, ఆమె అచ్చు దీపికాలానే ఉందంటూ నెటిజన్లు ఫిదా అయ్యారు.
సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం దీపికా పదుకొణె కెరీర్ పరంగా కూడా టాప్ గేర్‌లో ఉన్నారు. షారుఖ్ ఖాన్ 'కింగ్', అల్లు అర్జున్ రాకా సినిమాల్లో దీపికా పదుకొణె హీరోయన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. కింగ్ 2026 డిసెంబర్ 24న విడుదల కానుంది.
ప్రళయ్ అనే చిత్రంలో
మరోవైపు రణ్‌వీర్ సింగ్ తన లేటెస్ట్ హిట్ 'ధురంధర్: ది రివెంజ్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ధురంధర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. తదుపరి జయ్ మెహతా దర్శకత్వంలో 'ప్రళయ్' అనే చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటించనున్నాడు.