Rambha Oorvasi Menaka Title Song Launch Event: కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ కామెడీ ఫాంటసీ సినిమా 'రంభ ఊర్వశి మేనక'. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించారు.
రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ లాంచ్

రంభ ఊర్వశి మేనక సినిమాలో సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ నలుగురు హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంభ ఊర్వశి మేనక సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా టీజర్‌కి, ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్. తప్పకుండా దీనికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.
"థియేటర్‌లో ఈ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అల్లరి నరేష్ గారితో నటించడం చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది" అని రాశి సింగ్ తెలిపింది.
కఠినమైన ఆహార నియమాలు
"రంభ ఊర్వశి మేనక సినిమా కోసం ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించాను. ఈ సినిమా షూటింగ్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్స్‌లో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని బ్యూటిఫుల్ రాశి సింగ్ పేర్కొంది.
{{/usCountry}}"రంభ ఊర్వశి మేనక సినిమా కోసం ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించాను. ఈ సినిమా షూటింగ్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్స్‌లో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని బ్యూటిఫుల్ రాశి సింగ్ పేర్కొంది.
{{/usCountry}}యాంకర్ విష్ణుప్రియ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ పాట మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్‌లో ఈ పాట మీ అందరినీ సీట్లో నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తుంది. తప్పకుండా సెప్టెంబర్ 4వ తేదీన థియేటర్‌లో కలుద్దాం. తప్పకుండా ఈ సినిమాని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
డ్యాన్స్‌కి రావడమే చూశాం
"ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘రంభ ఊర్వశి మేనక’ చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటివరకు రంభ, ఊర్వశి, మేనకలను ఒక డ్యాన్స్‌కి లేకపోతే ఒక సన్నివేశానికి రావడం చూశాము. కానీ ఈ కథ మాత్రం చుట్టూ రంభ, ఊర్వశి, మేనకల చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమా చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అల్లరి నరేష్ గారి కామెడీ టైమింగ్ అడిరిపోతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ" అని విష్ణుప్రియ చెప్పింది.
మరో హీరోయిన్ ప్రిషా సింగ్మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సాంగ్‌కి అందరూ డ్యాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఈ పాట నచ్చుతుంది. సెప్టెంబర్ 4న అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించింది.
డిఫరెంట్ కాస్టూమ్ వేసుకుని
"ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుని యాక్టింగ్ చేయడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అల్లరి నరేష్ గారితో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది" అని హీరోయిన్ ప్రిషా సింగ్ వెల్లడించింది.