Riva Kishan Dolly: ఆ హీరో కూతురు త్రాచుపాము లాంటిది, చెల్లి అంటూనే డాలీకి వెన్నుపోటు.. రివా కిషన్‌పై ఆగ్రహం.. ఏమైందంటే?
Riva Kishan Betrayal To Dolly Javed: తెలుగు నటుడు, సీనియర్ హీరో రవి కిషన్ కూతురు రివా కిషన్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో అలయన్స్‌లో డాలీ జావేద్ ఎలిమినేషన్ నేపథ్యంలో రివా కిషన్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో రివాపై తీవ్రస్థాయిలో మండిపడటానికి కారణం ఏంటో చూద్దాం.
Riva Kishan Betrayal To Dolly Javed: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న ఓటీటీ రియాలిటీ షో 'అలయన్స్' (Alliance) రోజురోజుకూ మరింత డ్రామాగా మారుతోంది. మన దగ్గర వచ్చే బిగ్ బాస్ తరహాలోనే వ్యూహాలు, గ్రూపిజం, గొడవలతో సాగుతోన్న ఈ హిందీ షోలో తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది.

రవి కిషన్ కూతురు
కంటెస్టెంట్ డాలీ జావేద్ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఆమె ఎలిమినేషన్ కంటే కూడా మరో కంటెస్టెంట్, తెలుగు నటుడు, భోజ్‌పురి సీనియర్ హీరో రవి కిషన్ కూతురు రివా కిషన్ ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డాలీని తన సొంత చెల్లిలా భావిస్తానని చెబుతూనే, మరో కంటెస్టెంట్‌కు ఇచ్చిన మాట కోసం ఆమెకు వెన్నుపోటు పొడిచిందంటూ రివ్వాపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
కుశాల్ తాండన్ కోసం చెల్లిని బలిచేసింది!
హౌస్‌లోని కంటెస్టెంట్లు ఓట్లు వేసి డాలీ జావేద్‌ను ఎలిమినేట్ చేశారు. నిజానికి వృద్ధి కంటే డాలీనే సేఫ్ అవుతుందని అందరూ గట్టిగా భావించారు. కానీ డాలీ ఎలిమినేట్ అవ్వడం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఎలిమినేషన్ ముగిసిన తర్వాత రివా కిషన్ (రివ్వా కిషన్) అసలు గుట్టు విప్పింది.
తాను డాలీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణం కుశాల్ తాండన్‌కు ఇచ్చిన మాటేనని ఒప్పుకుంది. డాలీని తన చిన్న చెల్లిలా చూసుకుంటానని చెప్తూనే.. కుశాల్‌కు ఇచ్చిన కమిట్‌మెంట్ కోసం ఆమెను ఇంటికి పంపక తప్పలేదని రివ్వా సమర్థించుకుంది.
సోషల్ మీడియాలో 'ఆస్తీన్ కా సాంప్' అంటూ ట్రోల్స్
రివ్వా ఇచ్చిన వివరణ నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. స్నేహితురాలిని, చెల్లిలాంటి అమ్మాయిని ఇంత దారుణంగా మోసం చేస్తారా అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్‌డిట్ (Reddit) వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
"నాకు అమ్మాయిల మధ్య ఉండే స్నేహం అంటే చాలా ఇష్టం. కానీ రివ్వా లాంటి వాళ్లు తీవ్రంగా నిరాశపరుస్తారు. డాలీని వేధిస్తోన్న కుశాల్ తాండన్ లాంటి టాక్సిక్ వ్యక్తి కోసం వీళ్లు ఎప్పుడూ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు," అని ఒక నెటిజన్ అసహనం వ్యక్తం చేశారు.
"ఆమె (రివ్వా కిషన్) కంటే పెద్ద త్రాచు పాములాంటిది. అంతకంటే పెద్ద పామును నేను చూడలేదు, అనవసరంగా అందరిపై పెత్తనం చెలాయిస్తుంది" అని మరొకరు కామెంట్ చేశారు. నమ్మకద్రోహానికి రివ్వానే నిదర్శనమంటూ 'ఆస్తీన్ కా సాంప్' (వెన్నుపోటు పొడిచే పాము) అనే ట్యాగ్‌తో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
నెటిజన్ల మనసులు గెలుచుకున్న డాలీ
ఎలిమినేట్ అయినప్పటికీ డాలీ జావేద్ సోషల్ మీడియాలో రియల్ విన్నర్‌గా నిలిచింది. హౌస్‌లో కుశాల్ తాండన్ ప్రవర్తనను, అతని వేధింపులను ఆమె ధైర్యంగా ఎదిరించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. డాలీని మాటిమాటికీ 'బద్తమీజ్' (పద్ధతి లేనిది) అంటూ దూషించిన కుశాల్‌కు ఆమె గట్టిగా బుద్ధి చెప్పింది.
ఓటీటీ షో నుంచి బయటకు వచ్చే ముందు డాలీ జావేద్ ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్ నెటిజన్ల మనసు గెల్చుకుంది. దాంతో ఆమెనే ఈ సీజన్ రియల్ క్వీన్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కునాల్ ఖేము హోస్ట్‌గా
ప్రముఖ నటుడు కునాల్ ఖేము హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'అలయన్స్' షోలో ప్రస్తుతం 16 మంది సెలబ్రిటీలు పోటీ పడుతున్నారు. గ్రూపులుగా విడిపోయి టాస్కులు ఆడుతూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఈ షోలో డ్రామా నెక్ట్స్ లెవెల్‌కు చేరుకుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా అలీ గోని, సీమా సజ్దే హౌస్‌లోకి అడుగుపెట్టడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ రియాలిటీ షో అలయన్స్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


