Riteish Deshmukh Apology For Dancing In Shivaji T Shirt: బాలీవుడ్ హీరో, హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ పీరియాడిక్ డ్రామా 'రాజా శివాజీ' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. సినిమా సాధించిన అపూర్వ విజయాన్ని వేడుక చేసుకుంటున్న తరుణంలో, రితేష్ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.
ప్రైవేట్ వేడుక ఇది

ఆ వీడియోలో రితేష్ దేశ్‌ముఖ్ శివాజీ మహారాజ్ బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకుని ఉండటం, డ్యాన్స్ చేయడం, వేషధారణపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేయడంతో, రితేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ట్రోలర్లకు గట్టి సమాధానం చెబుతూనే, శివాజీ భక్తుడిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. సినిమా యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వేడుక ఇది అని ఆయన స్పష్టం చేశారు.
ఆ టీషర్ట్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
వైరల్ వీడియోలో రితేష్ దేశ్‌ముఖ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ ఉన్న టీషర్ట్ ధరించి వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపించారు. దీనిపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేడుకల్లో అలాంటి టీషర్ట్ వేయడం శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని విమర్శించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ మనందరికీ ఆరాధ్యదైవం, ఆత్మగౌరవానికి చిహ్నం. అటువంటి మహనీయుడి బొమ్మ ఉన్న టీషర్ట్ ధరించి సంబురాలు చేసుకోవడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రితేష్ స్పష్టం చేశారు. అది కేవలం సమయాభావం వల్ల జరిగిన పొరపాటు మాత్రమేనని ఆయన వివరించారు. శివాజీని ఆరాధించే వ్యక్తిగా తన బాధ్యతను గుర్తిస్తూనే, వినమ్రంగా వివరణ ఇచ్చారు.
ఆ ఉద్దేశం నాకు అస్సలు లేదు
"రాజా శివాజీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకుని నేరుగా ఈ వేడుకకు హాజరయ్యాను. ఆ సమయంలో టీషర్ట్ మార్చుకోవడం మర్చిపోయాను. అంతేకానీ, శివాజీ మహారాజ్‌ను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు" అని రితేష్ దేశ్‌ముఖ్ వివరించారు.
{{/usCountry}}"రాజా శివాజీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకుని నేరుగా ఈ వేడుకకు హాజరయ్యాను. ఆ సమయంలో టీషర్ట్ మార్చుకోవడం మర్చిపోయాను. అంతేకానీ, శివాజీ మహారాజ్‌ను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు" అని రితేష్ దేశ్‌ముఖ్ వివరించారు.
{{/usCountry}}ఒకవేళ తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే, శివప్రేమిగా మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై తనకు ఉన్న గౌరవం, భక్తి ఎప్పటికీ అలాగే ఉంటాయని రితేష్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు.
మందు తాగారన్న ప్రచారానికి చెక్!
ఈ వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో మరో తీవ్రమైన ప్రచారం జరిగింది. వేడుకల్లో రితేష్ దేశ్‌ముఖ్ మద్యం సేవించారని కొందరు ఆరోపించారు. ఈ ఆరోపణలను రితేష్ తీవ్రంగా ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని కొట్టిపారేశారు.
ఈ వేడుకకు ఆహ్వానం లేని వ్యక్తి ఎవరో దొంగచాటుగా ఆ వీడియో తీశారని, దాని ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ మహారాజ్‌పై తనకు ఉన్న ఎనలేని గౌరవం, నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటాయని రితేష్ పునరుద్ఘాటించారు. "జై శివారాయ్ 🙏 మీ, రితేష్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్" అంటూ తన వివరణను ముగించారు.
"నేను నా జీవితంలో ఇప్పటివరకు మద్యం సేవించలేదు. భవిష్యత్తులో కూడా తాగను. ఈ విషయంలో నా స్టాండ్ చాలా క్లియర్" అని రితేష్ గట్టిగా సమాధానమిచ్చారు.
బాక్సాఫీస్ వద్ద 'రాజా శివాజీ' ప్రభంజనం
వివాదాలు ఒకవైపు నడుస్తున్నా, 'రాజా శివాజీ' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ మరాఠీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 117.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
మరాఠీ ఇండస్ట్రీ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన రికార్డు. కేవలం ఇండియాలోనే ఈ సినిమా రూ. 113.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విదేశీ మార్కెట్లలో కూడా కూ. 4.27 కోట్ల కలెక్షన్లను రాబట్టి స్థిరంగా సాగుతోంది. దాదాపు 91,858 షోల ద్వారా రూ. 95.86 కోట్ల నెట్ కలెక్షన్లను ఈ సినిమా సాధించి పవర్ ఫుల్ హిట్‌గా నిలిచింది.
సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్
రితేష్ దేశ్‌ముఖ్ సరసన ఆయన భార్య జెనీలియా నటించగా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.