Romanchakam OTT Release Details: 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన సరికొత్త రొమాంటిక్ బడ్డీ కామెడీ ఎంటర్‌టైనర్ 'రోమాంచకం'.
హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో విడుదలకి ముందే రోమాంచకం మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 3న అంటే నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సమయంలోనే రోమాంచకం ఓటీటీ వివరాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
సుమంత్ ప్రభాస్ హీరోగా చేసిన రోమాంచకం సినిమాలో బ్యూటిఫుల్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయిన్‌గా చేసింది. అనంతిక ఇదివరకు తెలుగులో 'మ్యాడ్', '8 వసంతాలు' చిత్రాలతో నటిగా బాగా మెప్పించింది. ఈ రోమాంచకం సినిమాకు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నవ్వులు పూయిస్తున్న కమెడియన్
భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు తోడవడంతో ఈ చిన్న సినిమాకు బిజినెస్ వర్గాల్లో ఊహించని క్రేజ్ లభించింది.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఫేమ్ నరేంద్ర రవి తనదైన కామెడీ టైమింగ్‌తో రోమాంచకం సినిమాలో బాగా ఆకట్టుకున్నాడని, థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడని టాక్ వస్తోంది. ఇక వాసుకి వైభవ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను మరింత పెంచాయని కామెంట్స్ వస్తున్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ హైలెట్
అయితే, రోమాంచకం సినిమాలో లవ్ స్టోరీ ఉన్నప్పటికీ ఇది మెయిన్‌గా బడ్డీ కామెడీ అని రివ్యూవర్స్ అంటున్నారు. హీరో తన ఫ్రెండ్స్‌తో చేసే కామెడీ, అల్లరి సినిమాకు హైలెట్‌గా నిలిచిందట. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఆకట్టుకుందని సమాచారం.
{{/usCountry}}అయితే, రోమాంచకం సినిమాలో లవ్ స్టోరీ ఉన్నప్పటికీ ఇది మెయిన్‌గా బడ్డీ కామెడీ అని రివ్యూవర్స్ అంటున్నారు. హీరో తన ఫ్రెండ్స్‌తో చేసే కామెడీ, అల్లరి సినిమాకు హైలెట్‌గా నిలిచిందట. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఆకట్టుకుందని సమాచారం.
{{/usCountry}}ఇక రోమాంచకం కథలోకి వెళితే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే యువకుడు హైదరాబాద్‌లో ఒక చిన్న రోమాంచకం పేరుతో ఓ డేటింగ్ యాప్ తయారు చేస్తాడు. ఆ డేటింగ్ యాప్‌లోనే అన్వేష్‌కు చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్) పరిచయం అవుతుంది.
ఓటీటీలోకి రోమాంచకం
ఇద్దరి మధ్య చాటింగ్, ఫోన్ కాల్స్, సరదా సంభాషణలతో ప్రేమలో పడతారు. ఒక రోజు మైథిలి పుట్టినరోజకు సర్‌ప్రైజ్ ఇద్దామని చెన్నై వెళ్తాడు అన్వేష్. ఓ హోటల్‌లో ఉండి మైథిలిని పిలుస్తాడు అన్వేష్. ఫోన్‌లో సరే అని చెప్పిన మైథిలి ఎంతకు రాదు. ఏమైందని చూస్తే ఫోన్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింట్లో అన్వేష్‌ను మైథిలి బ్లాక్ చేస్తుంది.
అది తెలిసి అన్వేష్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు మైథిలి ఎందుకు అన్వేష్‌ను బ్లాక్ చేసింది? మైథిలి ఎందుకు మాయమైంది? దానికి కారణం ఏంటీ? అనేదే రోమాంచకం సినిమా మిగతా కథ. ఇలాంటి రోమాంచకం ఓటీటీలోకి వచ్చేయనుంది.
రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్
డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రోమాంచకం ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లో రోమాంచకం ఓటీటీ రిలీజ్ కానుంది. అలాగే, అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్ వస్తోంది.
అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ రెస్పాన్స్‌ను బట్టి రోమాంచకం ఓటీటీ డేట్ మారే అవకాశం కూడా ఉందని సమాచారం. కానీ, ఓటీటీ రిలీజ్ వరకు ఆగడం కంటే థియేటర్లలో రోమాంచకం సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేయడం బెటర్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.