...
...
Next Story

OTT Crime: ఓటీటీలోకి నేరుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- శత్రువులు, కుటుంబ సమస్యల మధ్య నలిగే పోలీస్- ఎక్కడంటే?

Saif Ali Khan Kartavya OTT Streaming: ఓటీటీలోకి నేరుగా కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ కర్తవ్య స్ట్రీమింగ్‌కు వచ్చేయనుంది. శత్రువులు, కుటుంబ సమస్యల మధ్య నలిగే నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. మరి కర్తవ్య ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Apr 28, 2026, 14:52:12 IST
Advertisement

Saif Ali Khan Kartavya Direct OTT Relesae: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మరోసారి ఓటీటీ తెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. 'సేక్రేడ్ గేమ్స్', 'తాండవ్' వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌ల తర్వాత సైఫ్ అలీఖాన్ నటిస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా కర్తవ్య మూవీ ట్రైలర్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో అలరిస్తోంది.

దేవర విలన్ ఓటీటీ మూవీ

ఓటీటీలోకి నేరుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- శత్రువులు, కుటుంబ సమస్యల మధ్య నలిగే పోలీస్- ఎక్కడంటే?
ఓటీటీలోకి నేరుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- శత్రువులు, కుటుంబ సమస్యల మధ్య నలిగే పోలీస్- ఎక్కడంటే?

నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథాంశాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'కర్తవ్య' కూడా అదే కోవలోకి వస్తుంది. ఇందులో దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ 'పవన్ మాలిక్' అనే శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.

శత్రువులు-కుటుంబ సమస్యలు

విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రాణాపాయం కలిగించే శత్రువులు ఒకవైపు.. కుటుంబ సమస్యలు మరోవైపు.. ఇలా పవన్ మాలిక్ ఎదుర్కొనే ఘర్షణను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. మంగళవారం (ఏప్రిల్ 28) విడుదలైన కర్తవ్య ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. అది చూస్తుంటే సైఫ్ ఖాతాలో మరో హిట్ పక్కా అనిపిస్తోంది.

జర్నలిస్ట్ హత్య.. మలుపు తిరిగిన కథ

కర్తవ్య ఓటీటీ సినిమా కథ ప్రధానంగా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ఒక ప్రముఖ జర్నలిస్ట్ హత్య కేసును ఛేదించే బాధ్యత పవన్ మాలిక్‌పై పడుతుంది. ఈ క్రమంలో ఆయనకు రాజకీయ వర్గాల నుంచి, అండర్ వరల్డ్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది.

నిజాయితీగా ఉంటే

నిజాయితీగా ఉంటే తన కుటుంబానికి ప్రమాదం అని తెలిసినా, తన 'ధర్మాన్ని' నెరవేర్చాడా లేదా అనేదే అసలు కథ. విధి (Duty) వర్సెస్ కర్మ (Action) అనే అంశం చుట్టూ దర్శకుడు పుల్కిత్ ఈ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారు.

రెడ్ చిల్లీస్ నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్

కర్తవ్య మూవీ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇప్పటివరకు అయితే కర్తవ్య ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించలేదు. కానీ, మే నెలలోనే కర్తవ్య ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో కర్తవ్య ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సైఫ్ అలీ ఖాన్‌కు ఓటీటీలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మరోసారి సైఫ్ తన మార్క్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe