Samantha 9 Months Pregnancy Workout Video: తెరపై తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం జీవితంలో ఒక మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత గర్భధారణ సమయంలో కూడా తన ఫిట్నెస్ను ఏమాత్రం పక్కన పెట్టలేదు.
ప్రెగ్నెన్సీ సమయంలో సమంత వర్కౌట్స్ వీడియోలు

9వ నెలలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రెగ్నెన్సీ సమయంలో తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సమంత. మొదటి నెల నుంచి ప్రస్తుతం తొమ్మిదో నెల వరకు శరీరంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సమంత వ్యాయామాలు చేసిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
1వ నెల నుంచి 9వ నెల దాకా ఫిట్నెస్ ప్రయాణం
సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన వీడియోలో, గర్భధారణ ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు తాను చేసిన వివిధ రకాల వ్యాయామాలను పొందుపరిచారు. తాజాగా పంచుకున్న క్లిప్‌లో చెస్ట్ దగ్గర డంబెల్ పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తూ ఆమె కనిపించారు. "9వ నెల.. ఫైనల్ ల్యాప్" అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జత చేశారు. ప్రసవ సమయం దగ్గర పడిందని ఈ పోస్ట్ ద్వారా సమంత స్పష్టం చేశారు.
హీరోయిన్ కృతి కర్బందా కామెంట్
ఈ వీడియో చూసిన అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "మీ ముగ్గురికీ నా ప్రేమను పంపుతున్నాను!" అని హీరోయిన్ కృతి కర్బందా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ సమంత వర్కవుట్ వీడియో డిజిటల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీరం సహకరించినంత మేర వ్యాయామం చేయడం ఎంతో మేలని సమంత నిరూపిస్తున్నారు. గతంలో కూడా తన ప్రీనెటల్ వర్కవుట్ సెషన్స్ గురించి ఆమె మాట్లాడారు.
"శరీరం చెప్పేది వినడమే ముఖ్యం"
{{/usCountry}}ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీరం సహకరించినంత మేర వ్యాయామం చేయడం ఎంతో మేలని సమంత నిరూపిస్తున్నారు. గతంలో కూడా తన ప్రీనెటల్ వర్కవుట్ సెషన్స్ గురించి ఆమె మాట్లాడారు.
"శరీరం చెప్పేది వినడమే ముఖ్యం"
{{/usCountry}}"ఈ రోజుల్లో ట్రైనింగ్ విధానం కొద్దిగా మారింది. కష్టపడి వ్యాయామం చేయడం కంటే, శరీరం చెప్పేది వినడానికే ప్రాధాన్యత ఇస్తున్నాను" అని సమంత పేర్కొన్నారు. బరువులు ఎత్తడం మాత్రమే కాకుండా, శరీరానికి ఏది అవసరమో గుర్తించి వ్యాయామం చేయాలనే సందేశాన్ని ఆమె అందించారు.
కొయంబత్తూరులో శ్రీమంతం సందడి
ఇదిలా ఉంటే.. సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం డిసెంబర్ 2025లో తమిళనాడులోని కొయంబత్తూరు ఈశా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది.
ఈశా ఫౌండేషన్‌లో సమంత సీమంతం వేడుకలు
తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్న ఈ దంపతులు, కొద్ది వారాల క్రితం ఈశా ఫౌండేషన్లోనే సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను జరుపుకున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో సమంతా ఎంతోమంది గర్భిణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డెలివరీ సమయం దగ్గర పడటంతో అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.