టాలీవుడ్‌లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే మంచి సక్సెస్ అందుకుంటున్నాడు సంగీత్ శోభన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో అలరించిన సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు.
రాకాస సమ్మర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్

నిహారిక కొణిదెల నిర్మించిన రాకాసలో హీరోయిన్‌గా నయన్ సారిక అలరించింది. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన రాకాస సినిమా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాకాస సమ్మర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మానస శర్మ, హీరో సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మొదటి ఫీచర్ ఫిల్మ్
మానస శర్మ మాట్లాడుతూ .. "‘రాకాస’ నాకు మొదటి ఫీచర్ ఫిల్మ్. థియేటర్‌లో ఆడియెన్స్‌తో కలిసి ఈ మూవీని చూశాను. నేను ఏదైతే రాసుకున్నానో.. ఏదైతో అనుకున్నానో.. ఆ సీన్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నా నిర్మాతలు నిహారిక, జీ స్టూడియో, డిస్ట్రిబ్యూటర్లు సినిమా పట్ల, రిజల్ట్ పట్ల సంతృప్తిగా ఉన్నారు" అని తెలిపారు.
సర్‌ప్రైజింగ్‌గా ఉంచాలనుకున్నాం
"వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్‌ప్రైజింగ్‌గా ఉంచాలని అనుకున్నాం. ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. గెటప్ శ్రీను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన అన్వర్ గారు, అనుదీప్ గారు, విష్ణు గారు, మురళీ గారు, రాజు గార్లకు థాంక్స్. మా చిత్రానికి సపోర్ట్ ఇచ్చిన మీడియాకి థాంక్స్" అని డైరెక్టర్ మానస శర్మ చెప్పారు.
సంగీత్ శోభన్ కామెంట్స్
హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడి గారి సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ.. ఆయన ప్రమోషన్స్‌ని ఢీ కొట్టాలని మేం అనుకున్నాం. మూవీని వీలైనంత వరకు ఆడియెన్స్ వరకు రీచ్ చేయగలగాలి. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ప్రైజ్గా ఇంట్రడ్యూస్ చేయాలని ముందు నుంచీ అనుకున్నాం. ఆయన ఎంట్రీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అని అన్నాడు.
మహిళలు తరలి వచ్చి
{{/usCountry}}హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడి గారి సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ.. ఆయన ప్రమోషన్స్‌ని ఢీ కొట్టాలని మేం అనుకున్నాం. మూవీని వీలైనంత వరకు ఆడియెన్స్ వరకు రీచ్ చేయగలగాలి. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ప్రైజ్గా ఇంట్రడ్యూస్ చేయాలని ముందు నుంచీ అనుకున్నాం. ఆయన ఎంట్రీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అని అన్నాడు.
మహిళలు తరలి వచ్చి
{{/usCountry}}"ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన నిహారిక గారు, మానస శర్మ గారికి థాంక్స్. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ఈవెంట్‌ను పెట్టాం. మహిళలు తరలి వచ్చి మా సినిమాని చూస్తున్నారంటే మా కంటెంట్ వారికి నచ్చిందని భావిస్తున్నాం. మా మూవీని ఇంతలా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్" అని చెప్పుకొచ్చాడు సంగీత్ శోభన్.
సంక్రాంతి సీజన్ వచ్చినట్లు
ఇదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. "‘రాకాస’కి ఏడాది పాటు కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వస్తుంటే మళ్లీ సంక్రాంతి సీజన్ వచ్చినట్టు అనిపించింది" అని అభివర్ణించారు.