...
...
Next Story

ఓటీటీ, థియేటర్ రెండింట్లో డిజాస్టర్- తొలి మూవీ ఫెయిల్యూర్‌పై స్టార్ హీరో కుమార్తె షనయా కామెంట్స్- అదే నా డ్రీమ్ అంటూ!

బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో సంజయ్ కపూర్ గారాల పట్టి షనాయా కపూర్ తన మొదటి సినిమా ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ పరాజయంపై మనసు విప్పారు. బాక్సాఫీస్, ఓటీటీ వద్ద సినిమా నిరాశపరిచినప్పటికీ, కొత్త అవకాశాలతో దూసుకుపోతున్నానని, ఆ ఫెయిల్యూర్ తనను కృంగదీయలేదని షనయా కపూర్ స్పష్టం చేశారు.

Published on: Feb 6, 2026, 12:59:15 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ఒకరైన షనాయా కపూర్, విక్రాంత్ మాస్సే సరసన ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

ఓటీటీ, థియేటర్ రెండింట్లో డిజాస్టర్- తొలి మూవీ ఫెయిల్యూర్‌పై స్టార్ హీరో కుమార్తె షనయా కామెంట్స్- అదే నా డ్రీమ్ అంటూ!
ఓటీటీ, థియేటర్ రెండింట్లో డిజాస్టర్- తొలి మూవీ ఫెయిల్యూర్‌పై స్టార్ హీరో కుమార్తె షనయా కామెంట్స్- అదే నా డ్రీమ్ అంటూ!

అలాగే, గతేడాది సెప్టెంబర్ 5 నుంచి జీ5లో ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఇలా బాక్సాఫీస్, ఓటీటీల్లో తన మొదటి సినిమా ఫెయిల్యూర్ కావడంపై షనాయా కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ పరాజయం నన్ను ఆపలేదు!

తొలి సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంపై షనాయా స్పందిస్తూ.. "నా సినిమా చూసేందుకు థియేటర్లు నిండిపోవాలన్నది నా కల. కానీ, నా మొదటి సినిమా విషయంలో అది జరగలేదు. అయితే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే అప్పటికే నేను నా తదుపరి చిత్రం ‘తూ యా మై’ (Tu Yaa Main) షూటింగ్‌లో బిజీగా ఉన్నాను" అని వివరించారు.

సినిమా చూసిన కొద్దిమంది ప్రేక్షకులు తన నటనను మెచ్చుకోవడం తనకు ఎంతో మోటివేషన్‌ను ఇచ్చిందని షనయా కపూర్ పేర్కొన్నారు. "జీవితంలో ఎప్పుడూ ఆశను వదులుకోకూడదు. నేను మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు బ్యూటిపుల్ షనయా.

స్టార్ హీరో కుమార్తెగా

ఇక గ్లామర్ బ్యూటీ షనయా కపూర్ బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు అయిన సంజయ్ కపూర్ కుమార్తె అని తెలిసిందే. సంజయ్ కపూర్ కూతురుగా హిందీ చిత్ర సీమలోకి ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు.

ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన 'ది ఐస్ హావ్ ఇట్' కథ ఆధారంగా సంతోష్ సింగ్ ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ సినిమాను తెరకెక్కించారు. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే వంటి ప్రతిభావంతుడైన నటుడు ఉన్నప్పటికీ కథనం నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

అటు థియేటర్-ఇటు ఓటీటీ

ఇక షనాయా తన తదుపరి చిత్రం ‘తూ యా మై’ పైనే ఇప్పుడు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించారు. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ, హారర్ సర్వైవల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానుంది.

వచ్చే వారమే పరీక్ష.. షాహిద్ కపూర్‌తో పోటీ!

అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. అదే రోజు షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓ రోమియో’ (O Romeo) కూడా విడుదల కాబోతోంది. మరి ఈ రెండో ప్రయత్నంలోనైనా షనాయా కపూర్ హిట్ కొట్టి తన సత్తా చాటుతుందో లేదో చూడాలి!

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks