...
...
Next Story

నిలిచిపోయిన లవ్ అండ్ వార్ షూటింగ్- రణ్‌బీర్ కపూర్ అలియా భట్ విక్కీ కౌశల్ మధ్య గొడవలే కారణం- ఇదిగో క్లారిటీ!

సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ వాయిదా పడిందనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ మధ్య గొడవలు అయ్యాయని, అందుకే లవ్ అండ్ వార్ షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది.

Published on: Jan 4, 2026, 10:15:43 IST
Advertisement

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ (Love & War) గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందనే వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.

షూటింగ్ ఆగలేదు.. కేవలం బ్రేక్ మాత్రమే!

నిలిచిపోయిన లవ్ అండ్ వార్ షూటింగ్- రణ్‌బీర్ కపూర్ అలియా భట్ విక్కీ కౌశల్ మధ్య గొడవలే కారణం- ఇదిగో క్లారిటీ!
నిలిచిపోయిన లవ్ అండ్ వార్ షూటింగ్- రణ్‌బీర్ కపూర్ అలియా భట్ విక్కీ కౌశల్ మధ్య గొడవలే కారణం- ఇదిగో క్లారిటీ!

అయితే, ఈ పుకార్లపై చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన సన్నిహిత వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి. "సినిమా యూనిట్ ప్రస్తుతం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఇయర్-ఎండ్ బ్రేక్‌లో ఉంది. భన్సాలీ సినిమాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి, చిన్న విరామం వచ్చినా అది వాయిదా పడినట్లుగా కనిపిస్తుంది" అని చిత్ర బృందానికి చెందిన ఒక ప్రతినిధి పేర్కొన్నారు.

పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో

లవ్ అండ్ వార్ పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ప్యాచ్ వర్క్, కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ఆయన వివరించారు.

నటీనటుల మధ్య గొడవలా? నిజం ఇదీ!

రణ్‌బీర్, ఆలియా, విక్కీ మధ్య గొడవలు వచ్చాయనే వార్తలను చిత్ర యూనిట్ పూర్తిగా ఖండించింది. "వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఇవి చాలా సుదీర్ఘమైన, శ్రమతో కూడిన షూటింగ్ షెడ్యూల్స్. నటీనటులందరూ ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నారు. జనవరి మధ్యలో మళ్లీ షూటింగ్ మొదలై మార్చి వరకు సాగుతుంది" అని ఇన్‌సైడర్ సమాచారం.

విడుదల ఎప్పుడు?

అయితే చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, లవ్ అండ్ వార్ సినిమాతో పాటు రణ్‌బీర్ కపూర్ రామాయణ పార్ట్ 1లో చేస్తున్నాడు. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

అలియా భట్ సినిమా

సాయి పల్లవి, యశ్ వంటి స్టార్లతో రూపొందుతున్న రామాయణ పార్ట్ 1 చిత్రం 2026 దీపావళికి విడుదల కానుంది. ఇక అలియా భట్ విషయానికొస్తే.. వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’లో నటిస్తోంది. 2026లో రాబోతున్న ఈ మూవీలో ఆలియా సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపించబోతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks