Save The Tigers Season 3 OTT Premiere Success: సోమవారం (జూన్ 15) సాయంత్రం హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన తెలుగు ఓటీటీ సిరీస్ “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాగా.. వారి నవ్వులతో, సందడితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది.
ప్రాంతీయ ఓటీటీ వినోదం

అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం, క్రియేటర్లు.. ఇలా అందరూ కలిసి ప్రాంతీయ ఓటీటీ వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన సీజన్3ను చూసి ఎంజాయ్ చేశారు.
తారల తళుకులతో మెరిసిన ఈ రెడ్ కార్పెట్ వేడుకకు టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీల మెరిసే హాజరు, ఎక్స్‌క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్లు, అలాగే ప్రీ స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్.. ఇలా అన్నీ కలిసి సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభానికి అద్భుతమైన వేదికగా నిలిచాయి.
తారల సందడి
సేవ్ ది టైగర్స్ 3 స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, కల్యాణ్ పడాలా (బిగ్ బాస్ సీజన్ 9 విజేత), హీరో చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, కార్తీక దీపం 2 హీరో నిరుపమ్ పరిటాల, కిరీటి దామరాజు, బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని ఓటీటీ ప్రీమియర్‌ను ఎంజాయ్ చేశారు.
ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి వంటి నటీనటుల పెర్ఫామెన్స్‌లకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మూడు జంటల కథతో పాటు ప్రత్యేకమైన పాత్రలో వెన్నెల కిషోర్ నటించిన ఈ సిరీస్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.
టైగర్స్ మళ్లీ వచ్చేశారు
{{/usCountry}}ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి వంటి నటీనటుల పెర్ఫామెన్స్‌లకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మూడు జంటల కథతో పాటు ప్రత్యేకమైన పాత్రలో వెన్నెల కిషోర్ నటించిన ఈ సిరీస్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.
టైగర్స్ మళ్లీ వచ్చేశారు
{{/usCountry}}సేవ్ ది టైగర్స్ సీజన్3కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది వరకు మేకర్స్ చెప్పినట్లుగానే, “రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన! దీనిని దేవుడి ప్లాన్ అనాలా, లేక విధి అనాలా!… అందరి దృష్టిని ఆకర్షిస్తూ, పరిస్థితులను తలకిందులు చేస్తూ, ప్రేక్షకుల మన్ననలు పొందేలా టైగర్స్ మళ్లీ వచ్చేశారు.
జియో హాట్‌స్టార్‌లో జూన్ 19న సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ కానుంది. అంటే, అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. జూన్ 19 అర్థరాత్రి నుంచే జియో హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
అతిపెద్ద తెలుగు ఓటీటీ సిరీస్
ఓటీటీల్లో వ్యూయర్‌షిప్ పరంగా “సేవ్ ది టైగర్స్” అతిపెద్ద తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచింది. మొదటి రెండు సీజన్స్‌లోని కామెడీ, ఆసక్తికరమైన పాత్రలు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి.
దీంతో సీజన్3పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఈ కొత్త సీజన్ సరికొత్త ఫ్యాంటసీ ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠను పెంచేందుకు సిద్ధంగా ఉంది. కామెడీ ఫాంటసీగా తెరకెక్కిన సేవ్ ది టైగర్స్ సీజన్ 3లో ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు నటించారు.