...
...
Next Story

Save The Tigers 4 OTT: భార్యాబాధితుల క్లబ్‌లోకి టాలీవుడ్ స్టార్ హీరో? ఓటీటీలోకి సేవ్ ది టైగర్స్ 4 కూడా! మేకర్స్ చర్చలు !

Star Hero In Save The Tigers Season 4 OTT: తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన మూడో సీజన్ సూపర్ హిట్ కావడంతో, ఈసారి కథలోకి ఒక స్టార్ హీరోను రంగంలోకి దించేందుకు మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Published on: Jun 26, 2026, 18:48:25 IST
Advertisement

Star Hero In Save The Tigers Season 4 OTT: డిజిటల్ స్క్రీన్‌లపై నవ్వుల పండగ పండించిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ తెలుగు ఓటీటీ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్‌’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్లతో ఓటీటీ వీక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఈ సిరీస్.. ఇప్పుడు నాలుగో భాగంతో (Season 4) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే

భార్యాబాధితుల క్లబ్‌లోకి టాలీవుడ్ స్టార్ హీరో? ఓటీటీలోకి సేవ్ ది టైగర్స్ 4 కూడా! మేకర్స్ చర్చలు !
భార్యాబాధితుల క్లబ్‌లోకి టాలీవుడ్ స్టార్ హీరో? ఓటీటీలోకి సేవ్ ది టైగర్స్ 4 కూడా! మేకర్స్ చర్చలు !

జియో హాట్‌స్టార్‌లో జూన్ 19 నుంచి 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే సేవ్ ది టైగర్స్ 3 ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి సీజన్ పనులను అప్పుడే ప్రారంభించారు.

సాధారణంగా తెలుగు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ కథలకే ఆదరణ ఉంటుందనే అంచనాలను తిప్పికొడుతూ ఈ సిరీస్ దూసుకుపోయింది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఫాంటసీ డ్రామా భార్యాబాధితులైన ముగ్గురు భర్తల కథతో సాగుతుంది.

పెళ్లయిన ప్రతి మగవాడు తన జీవితంలో ఎదుర్కొనే రోజువారీ గిల్లికజ్జాలు, ఈగో సమస్యలను దర్శకుడు ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఈ రిలేటబుల్ కామెడీనే సిరీస్ విజయానికి ప్రధాన కారణమైంది.

మూడో సీజన్ సక్సెస్‌తో జోష్‌లో మహి వి. రాఘవ్

ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు మ‌హి వి.రాఘ‌వ్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొదటి రెండు సీజన్ల తరహాలోనే మూడో సీజన్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. విశేషమేమిటంటే ఈ సీజన్ చివరలో చూపించిన ఒక వింతైన 'కాస్మిక్ ట్విస్ట్' కథను సరికొత్త మలుపు తిప్పింది.

ఇక అసలు విషయానికి వస్తే.. సేవ్ ది టైగర్స్ సీజన్ 4ను మునుపటి కంటే చాలా గ్రాండ్‌గా, భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే సీజన్‌లో టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరోను అతిథి పాత్రలో లేదా ఒక కీలక పాత్రలో నటించేలా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.

నిత్యం భార్యల చేతిలో చిక్కుకుని అల్లాడిపోయే ముగ్గురు మిత్రుల జీవితాల్లోకి ఈ స్టార్ హీరో క్యారెక్టర్ ఎలా రాబోతోంది? అతని ఎంట్రీతో కథ ఎలాంటి మలుపులు తీసుకోనుంది? అనే అంశాలపై స్క్రిప్ట్ టీమ్ కసరత్తులు చేస్తోంది.

స్టార్ హీరోతో సంప్రదింపులు

ప్రస్తుతం సదరు స్టార్ హీరోతో సంప్రదింపులు తుది దశకు చేరినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ క్రేజీ అప్‌డేట్‌పై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేసేందుకు కథలో మరిన్ని ట్విస్టులు జోడించబోతున్నారు. ఏదేమైనా, ఒక స్టార్ హీరో తోడైతే ఈ ఓటీటీ సిరీస్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe