...
...
Next Story

సీనియర్ నటుడి వారసుడిగా ప్రణమ్ దేవరాజ్ ఎంట్రీ- ఒకే తెరపై అన్నదమ్ములు- బిగ్ బాస్ 10 ఎలిమినేషన్ తర్వాత చైత్ర రాయ్ మూవీ

Pranam Devaraj Sanjana Anand Bigg Boss 10 Chaitra Rai Sreerasthu Movie: ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'శ్రీరస్తు'. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బిగ్ బాస్ తెలుగు 10 ఎలిమినేషన్ తర్వాత చైత్ర రాయ్ నటించిన సినిమా ఇదే కావడం విశేషం.

Published on: Sep 15, 2026, 21:22:58 IST
Advertisement

Pranam Devaraj Sanjana Anand Bigg Boss 10 Chaitra Rai Sreerasthu Movie: సినీ అభిమానులను, కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన కథాంశంతో సినిమా సిద్ధమవుతోంది. సీనియర్ నటుడు దేవరాజ్ నట వారసుడిగా, ప్రజ్వల్ దేవరాజ్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రణమ్ దేవరాజ్.

ప్రణమ్ దేవరాజ్‌కో జోడీగా సంజనా ఆనంద్

సీనియర్ నటుడి వారసుడిగా ప్రణమ్ దేవరాజ్ ఎంట్రీ- ఒకే తెరపై అన్నదమ్ములు- బిగ్ బాస్ 10 ఎలిమినేషన్ తర్వాత చైత్ర రాయ్ మూవీ
సీనియర్ నటుడి వారసుడిగా ప్రణమ్ దేవరాజ్ ఎంట్రీ- ఒకే తెరపై అన్నదమ్ములు- బిగ్ బాస్ 10 ఎలిమినేషన్ తర్వాత చైత్ర రాయ్ మూవీ

ప్రణమ్ దేవరాజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమానే 'శ్రీరస్తు'. ఈ సినిమాలో ప్రణమ్ దేవరాజ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ శ్రీరస్తు చిత్రాన్ని హరి క్రియేషన్స్ పతాకంపై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. శంకర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

కన్నడ తెలుగు ద్విభాషా చిత్రంగా శ్రీరస్తు

ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న శ్రీరరస్తు సినిమాను ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. రెండు భాషల ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా కథనాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఫ్యామిలీ డ్రామాకు యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

కుటుంబ సంబంధాలు, నేటి తరం ఆలోచనలను జోడిస్తూ ఒక పక్కా వినోదాత్మక చిత్రంగా 'శ్రీరస్తు' సినిమాను మలుస్తున్నారు. కథలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే ఆకట్టుకునే ప్రేమకథ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పక్కింటి కుర్రాడిలా కనిపించే ప్రణమ్ దేవరాజ్ నటన, సంజనా ఆనంద్ గ్లామర్ తోడుగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తారల సందడి.. ప్రత్యేక పాత్రలో ప్రజ్వల్ దేవరాజ్

బిగ్ బాస్ 10 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత చైత్ర రాయ్ నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. శేఖర్ చంద్ర ఈ శ్రీరస్తు చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన అందిస్తున్న మెలోడీలు, మాస్ బిట్లు సినిమాకు అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ, శ్రీ వర్కల ఎడిటింగ్, కృష్ణ మాయ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

త్వరలో శ్రీరస్తు ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్

ప్రస్తుతం శ్రీరస్తు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే 'శ్రీరస్తు' ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాదే సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks