...
...
Next Story

లైంగికంగా వేధించినవాడే సహాయం చేశాడు, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం.. 13 ఏళ్లప్పుడు జరిగిన దారుణంపై సీరియల్ నటుడు రామ్

Actor Ram Kapoor On Childhood Molestation: ప్రముఖ సీరియల్ నటుడు రామ్ కపూర్ తనకు 13 ఏళ్లప్పుడు జరిగిన దారుణంపై తాజాగా రివీల్ చేశారు. 8వ తరగతిలో టెన్త్ క్లాస్ అబ్బాయి వచ్చి దుప్పట్లో చేయి పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడని, చివరగా తామిద్దరు మంచి ఫ్రెండ్స్ అయినట్లు చెప్పుకొచ్చారు రామ్ కపూర్.

Published on: Jul 12, 2026, 10:36:51 IST
Advertisement

Actor Ram Kapoor On Childhood Molestation: బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటుడు రామ్ కపూర్ తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనను పంచుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గతంలో హోస్ట్ చేసిన, ప్రస్తుతం సరికొత్తగా సాగుతున్న క్రేజీ రియాలిటీ ఓటీటీ షో 'లాకప్: సచ్ యా సజా' సీజన్ 2 లో ఈ ఘటన వెలుగుచూసింది.

రహస్యాన్ని పంచుకోవాలి

లైంగికంగా వేధించినవాడే సహాయం చేశాడు, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం.. 13 ఏళ్లప్పుడు జరిగిన దారుణంపై సీరియల్ నటుడు రామ్
లైంగికంగా వేధించినవాడే సహాయం చేశాడు, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం.. 13 ఏళ్లప్పుడు జరిగిన దారుణంపై సీరియల్ నటుడు రామ్

ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి తృటిలో తప్పించుకోవడానికి ఓటీటీ షో నిబంధనల ప్రకారం రామ్ కపూర్ తన మనసులోని ఒక రహస్యాన్ని ప్రేక్షకులతో పంచుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన చెప్పిన చేదు జ్ఞాపకాలు అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేశారు. హోస్ట్ ఫరా ఖాన్‌తో పాటు తోటి కంటెస్టెంట్లు హర్షద్ చోప్రా, ధీరజ్ ధూపర్, సూఫీ మోతివాలా ఈ మాటలు విని కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

8వ తరగతిలోనే ఆ నరకం..

తమ హాస్టల్ రోజుల్లో జరిగిన ఆ భయానక రాత్రిని రామ్ కపూర్ లాకప్ 2 ఓటీటీ షోలో గుర్తుచేసుకున్నారు సీరియల్ నటుడు రామ్ కపూర్. అప్పట్లో తానొక చిన్న పిల్లాడినని, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని వయసని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు, 13 ఏళ్ల వయసులో నాపై లైంగిక వేధింపులు జరిగాయి. స్కూల్ సమయం అయిపోయిన తర్వాత మేమంతా హాస్టల్ రూముల్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. ఆ సమయంలో టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక సీనియర్ స్టూడెంట్ నా బెడ్‌పై వచ్చి కూర్చున్నాడు" అని రామ్ కపూర్ చెప్పారు.

40 మంది పిల్లలున్నప్పటికీ

"రూమ్‌లో దాదాపు 30-40 మంది పిల్లలు ఉన్నప్పటికీ, ఎవరూ చూడకుండా దుప్పటి లోపల నన్ను అసభ్యంగా తాకడం ప్రారంభించాడు. ఆ క్షణంలో నేను భయంతో పూర్తిగా గడ్డకట్టుకుపోయాను" అని రామ్ కపూర్ ఆనాటి భయానక అనుభవాన్ని వివరించారు.

ఈ ఘటన తర్వాత రామ్ కపూర్ మానసికంగా తీవ్రమైన క్షోభ (ట్రామా) అనుభవించారు. హాస్టల్‌లో ఎవరితోనూ మాట్లాడకుండా చాలా సైలెంట్‌గా మారిపోయారు. అయితే, ఆ తప్పు చేసిన సీనియర్ కొన్ని వారాల తర్వాత రామ్ కపూర్ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

"నన్ను మానసిక వేధనకు గురిచేసిన ఆ వ్యక్తే, ఆ తర్వాత నేను ఆ భయం నుంచి బయటపడటానికి సహాయం చేశాడు. ఇది వినడానికి వింతగా అనిపించినా, కాలక్రమేణా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. నా జీవితంలో జరిగిన ఈ సంఘటన నా పిల్లలకు గానీ, తల్లిదండ్రులకు గానీ తెలియదు. కేవలం నా భార్య గౌతమికి మాత్రమే తెలుసు" అని రామ్ కపూర్ వెల్లడించారు.

ఆత్మీయంగా ఫీల్ అవుతాను

"ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆనాటి భయం నన్ను వెంటాడుతోంది. కానీ, ఈ అనుభవం వల్ల నాలో ఒక మంచి మార్పు వచ్చింది. నాకు ఎల్‌జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీపై ఎలాంటి చిన్నచూపు లేదా భయం లేదు. సూఫీ లాంటి వ్యక్తులను కలిసినప్పుడు నేను ఎంతో ఆత్మీయంగా ఫీలవుతాను" అని రామ్ కపూర్ స్పష్టం చేశారు.

ఆ సీనియర్ విద్యార్థి చెడ్డవాడు కాదని, టీనేజ్ హార్మోన్ల ప్రభావం, ఉత్సాహం వల్లే అలా చేశాడని రామ్ కపూర్ వెనకేసుకొచ్చారు. తన తప్పును తెలుసుకుని, తనను ఆ మానసిక స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి అతను ఎంతో ప్రయత్నించాడని చెప్పారు. ఎవరి జీవితంలోనూ ఇలాంటి దారుణాలు జరగకూడదని ఆయన ఆకాంక్షించారు.

స్టేజ్ పైనే ఏడ్చేసిన ఫరా ఖాన్, రితేష్

రామ్ కపూర్ తన చేదు జ్ఞాపకాలను చెబుతుంటే తోటి కంటెస్టెంట్ సూఫీ మోతివాలా వెక్కి వెక్కి ఏడ్చారు. తన చిన్నతనంలో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని గుర్తుచేసుకున్నారు. హర్షద్ చోప్రా, ధీరజ్ ధూపర్ కూడా కంటతడి పెట్టారు. స్టేజ్ మీదున్న ఫరా ఖాన్ ఎంతో భావోద్వేగానికి లోనై, రామ్ కపూర్‌ను గట్టిగా హత్తుకుని ఓదార్చారు. మరో కో-హోస్ట్ రితేష్ దేశ్‌ముఖ్ సైతం రామ్ కపూర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

"నీవు చాలా ధైర్యవంతుడివి. గత వారం నేను నీ నుంచి ఒక విషయం నేర్చుకున్నానని చెప్పాను, ఈ రోజు నీవు చెప్పిన మాటలు చూసి నాకు నీపై ఎంతో గర్వంగా ఉంది" అని రితేష్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు.

డబుల్ ఎలిమినేషన్‌

ఇక 'లాకప్: సచ్ యా సజా' షో విషయానికి వస్తే, రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఓటీటీ స్క్రీన్స్‌పై దూసుకుపోతోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా సునీతా అహుజా, రియాజ్ షో నుంచి బయటకు వచ్చారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

సునీత ఆరోగ్య కారణాల వల్ల తప్పుకోగా, రియాజ్ తక్కువ ఓట్ల వల్ల ఎలిమినేట్ అయ్యారు. శ్రేయా కల్రా ఈ వారం సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. ఈ క్రేజీ షో ప్రతి శనివారం నుంచి గురువారం వరకు రాత్రి 8 గంటలకు నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks