Serial Actress Akanksha On Sexuality Phase: ప్రసిద్ధ ఓటీటీ రియాలిటీ షో లాక్ అప్: సచ్ యా సజా సీజన్ 2 అట్టహాసంగా ముగిసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన లాక్ అప్ 2 విజేతగా శ్రేయా కల్రా ట్రోఫీని కైవసం చేసుకున్నారు. అయితే, ఫినాలేకి ముందే షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రముఖ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా మాత్రం నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు.
తేజస్వి ప్రకాశ్ వార్నింగ్ ఇచ్చినా వినకుండా..

భర్త గౌరవ్ ఖన్నాతో విడిపోవడం, లైంగికతపై తను చేసిన వ్యాఖ్యల వల్ల ఆకాంక్ష చమోలా బయటకు వచ్చిన క్షణం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓటీటీ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మరో నటి తేజస్వి ప్రకాశ్ ఆమెతో మాట్లాడారు. లైంగికత అనేది ఎంత సున్నితమైన అంశమో వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆకాంక్ష తన పాత వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
ఎవరితోనూ సంబంధాలు వద్దని
"శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే కొన్ని అనుభవాలు మనుషులను ఒక స్థితికి చేరుస్తాయి. ఆ సమయంలో ఎవరితోనూ సంబంధాలు వద్దు అనిపిస్తుంది. దానర్థం మనుషుల మధ్య భావోద్వేగ బంధం ఉండదని కాదు. ప్రస్తుతం నేను అలాంటి శారీరక సంబంధాలకు దూరంగా ఉన్నాను. అందుకే ఇదొక తాత్కాలిక దశ అని చెప్తున్నాను" అని ఆకాంక్ష సమర్థించుకున్నారు.
నెటిజన్లు, ఎల్‌జీబీటీక్యూ+ సంఘాల ఆగ్రహం
ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా తమ హక్కుల కోసం, గుర్తింపు కోసం పోరాడుతున్న ఎల్‌జీబీటీక్యూ+ (LGBTQ+) సమాజ పోరాటాలను ఆకాంక్ష ఒక్క మాటతో తేలిక చేశారని ఆరోపిస్తున్నారు.
సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవసరం
"లైంగికత అనేది ఫ్యాషన్ స్టేట్మెంట్ కాదు. సమాజంలో ఇప్పటికే దీనిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. ఒక జాతీయ వేదికపై నిలబడి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఆమెకు తగిన మీడియా ట్రైనింగ్, సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవసరం" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆమె అజ్ఞానానికి నిదర్శనం
{{/usCountry}}"లైంగికత అనేది ఫ్యాషన్ స్టేట్మెంట్ కాదు. సమాజంలో ఇప్పటికే దీనిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. ఒక జాతీయ వేదికపై నిలబడి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఆమెకు తగిన మీడియా ట్రైనింగ్, సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవసరం" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆమె అజ్ఞానానికి నిదర్శనం
{{/usCountry}}మరొకవైపు, మనుషుల లైంగికత కాలంతో పాటు మారే అవకాశం ఉన్నప్పటికీ (Fluidity), దాన్ని కేవలం ఒక తాత్కాలిక ఫేజ్ అని తేల్చేయడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. ఆకాంక్షకు సరిగా భావాలను వ్యక్తపరచడం రాకపోవడం వల్లనే ఈ రచ్చ జరుగుతోందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
లాక్ అప్ ఇంట్లో బయటపడిన రహస్యాలు
ఈ రియాలిటీ ఓటీటీ షోలో ఉన్న సమయంలో ఆకాంక్ష పలు వ్యక్తిగత విషయాలను బయటపెట్టారు. నటుడు గౌరవ్ ఖన్నాతో తాను విడాకులు తీసుకోబోతున్నానని, ఈ విషయం కేవలం ఇరు కుటుంబాలకు మాత్రమే తెలుసని వెల్లడించారు.
బైసెక్సువల్ అని
అంతేకాకుండా, గొడవ జరిగిన సమయంలో శ్రేయా కల్రా (లాకప్ 2 విన్నర్) ఆకాంక్ష 'బైసెక్సువల్' అనే విషయాన్ని బయటపెట్టారు. గౌరవ్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందే తాను బైసెక్సువల్‌గా ఉండేదాన్నని చెప్పి అందరినీ గందరగోళంలో పడేశారు.
ఒత్తిడి వల్ల దూరం
ప్రస్తుతం విడాకుల ఒత్తిడి వల్ల తాను ఎలాంటి శారీరక సంబంధాలకు దూరంగా (Asexual) ఉంటున్నానని సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష చమోలా చెప్పుకొచ్చారు.