...
...
Next Story

OTT Bold: ఓటీటీలోకి వచ్చిన నయా బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్- భయంకరమైన లైవ్ క్యామ్ బిజినెస్,బలైన గృహిణి పోరాటం-ఇక్కడ చూసేయండి!

Service Girl OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన నయా బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సర్వీస్ గర్ల్. డీప్ ఫేక్, సైబర్ నేరాలు, భయంకరమైన లైవ్ క్యామ్ బిజినెస్ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. సైబర్ ముఠాపై ఓ గృహిణి చేసే పోరాటంగా వచ్చిన సర్వీస్ గర్ల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 6, 2026, 06:10:05 IST
Advertisement

Service Girl OTT Release: టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తోందో, దాన్ని దుర్వినియోగం చేస్తూ అమాయకుల ప్రాణాలతో ఆడుకునే సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి సృష్టిస్తున్న 'డీప్‌ఫేక్' వీడియోలు నేడు ఎందరో మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి.

డిజిటల్ ప్రపంచంలోని చీకటి కోణం

ఓటీటీలోకి వచ్చిన నయా బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్- భయంకరమైన లైవ్ క్యామ్ బిజినెస్,బలైన గృహిణి పోరాటం-ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి వచ్చిన నయా బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్- భయంకరమైన లైవ్ క్యామ్ బిజినెస్,బలైన గృహిణి పోరాటం-ఇక్కడ చూసేయండి!

సరిగ్గా ఇదే ముఖ్యాంశంతో, డిజిటల్ ప్రపంచంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సరికొత్త సైబర్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ 'సర్వీస్ గర్ల్'. క్రైమ్, ఏఐ టెక్నాలజీ, బోల్డ్, ఫ్యామిలీ డ్రామా, రివేంజ్ వంటి అంశాలతో ఈ సర్వీస్ గర్ల్ ఓటీటీ సిరీస్‌ను తెరకెక్కించారు.

ఒక్క నకిలీ వీడియో.. ముక్కలైన జీవితం

సాంప్రదాయ కుటుంబానికి చెందిన దివ్య (ఖుషి దూబే) అనే గృహిణి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి సైబర్ క్రిమినల్స్ రూపంలో ఊహించని తుపాను వస్తుంది. దివ్య ముఖాన్ని ఉపయోగిస్తూ ఏఐ సాంకేతికతతో సృష్టించిన ఒక నకిలీ అడల్ట్ కంటెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాత్రికి రాత్రే దివ్య సంసారం కూలిపోతుంది. కట్టుకున్న భర్తతో పాటు కుటుంబ సభ్యులు, సమాజం ఆమెను అసహ్యించుకుంటాయి. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ నమ్మరు. అయితే, ఆ నిందను మోస్తూ కూర్చోకుండా తన జీవితాన్ని నాశనం చేసిన నేరస్థుల గుట్టు రట్టు చేయడానికి గృహిణి దివ్య ధైర్యంగా అడుగు ముందుకు వేసి పోరాటం చేస్తుంది.

సైబర్ ముఠా అసలు రూపం

ఈ కథలో విలన్‌గా నిషాద్ వైద్య 'జాకీ భయ్యా' అనే విలక్షణమైన పాత్రలో కనిపించారు. ఇంటర్నెట్ ఆధారిత 'లైవ్ క్యామ్' సర్వీస్ నడుపుతూ సైబర్ నేరాలకు పాల్పడే ముఠాకు ఇతనే మాస్టర్ మైండ్. ఈ పాత్ర కోసం నిషాద్ నత్తిగా మాట్లాడే శైలిని అలవర్చుకుని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. అతనికి కుడిభుజంగా జహంగీర్ ఖాన్ మరో కీలకమైన నెగెటివ్ పాత్రలో నటించారు.

"ఏఐ సాంకేతికతతో ఒక నకిలీ వీడియోను సృష్టించి నా పాత్ర జీవితాన్ని నాశనం చేస్తారు. సమాజంలో ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చాలా మంది అమాయక అమ్మాయిలు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ తీవ్రమైన సమస్యను అధిగమించి ఆ అమ్మాయి ఎలా పోరాడిందో ఈ ఓటీటీ సిరీస్ ద్వారా చూపించాం" అని హీరోయిన్ ఖుషి దూబే సర్వీస్ గర్ల్ ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా తెలిపారు.

ఇంటర్నెట్ వెనుకున్న భయానక నిజాలు

"ఇంటర్నెట్ వెనుక ఉన్న భయానక నిజాలకు ఈ సిరీస్ అద్దం పడుతుంది. ప్రతిరోజూ ఎందరో అమాయకులు ఇలాంటి డిజిటల్ కుట్రలకు బలవుతున్నారు. బాధితుల పట్ల సమాజంలో అవగాహన, సానుభూతి పెరగాల్సిన అవసరం ఉంది" అని నటి మల్లోబికా బెనర్జీ పేర్కొన్నారు.

ఉత్కంఠభరితమైన కథనం, సమాజానికి అవసరమైన సందేశంతో 'సర్వీస్ గర్ల్' రూపొందింది. హంగామా ఓటీటీలో సర్వీస్ గర్ల్ స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 3న హంగామాలో సర్వీస్ గర్ల్ ఓటీటీ రిలీజ్ అయింది.

హంగామా ఓటీటీతోపాటు

హంగామాతో పాటు టాటా ప్లే బింజ్, వాచో, బీఎస్ఎన్ఎల్, ప్లేబాక్స్ టీవీ, రైల్‌వైర్ బ్రాడ్‌బ్యాండ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, డోర్ టీవీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో కూడా సర్వీస్ గర్ల్ అందుబాటులో ఉంది. కాస్తా బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికీ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన పర్ఫెక్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సర్వీస్ గర్ల్ అని చెప్పుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks