...
...
Next Story

ఆ ప్రచారమే సినిమాను చంపేస్తోంది.. సొంత ఇండస్ట్రీపై బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సినిమా మార్కెటింగ్, ప్రస్తుత మేకింగ్ స్టైల్‌పై ఘాటుగా స్పందించారు. ఆ ప్రచారమే సినిమాలోని స్వచ్ఛతను దెబ్బతీస్తోందని, మంచి సినిమాలు రాకపోవడానికి అది కూడా ఒక కారణమని షాహిద్ కపూర్ అభిప్రాయపడ్డారు. రోమియో మూవీ ప్రమోషన్స్‌లో సొంత ఇండస్ట్రీపై షాహిద్ కపూర్ కామెంట్స్ చేశారు.

Published on: Feb 1, 2026, 05:40:17 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O Romeo) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రఖర్ గుప్తా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న షాహిద్ కపూర్ ప్రస్తుతం తన సొంత సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులపై మనసులోని అసహనాన్ని బయటపెట్టారు.

షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు

ఆ ప్రచారమే సినిమాను చంపేస్తోంది.. సొంత ఇండస్ట్రీపై బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్ (Instagram/Shahid Kapoor)
ఆ ప్రచారమే సినిమాను చంపేస్తోంది.. సొంత ఇండస్ట్రీపై బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్ (Instagram/Shahid Kapoor)

ముఖ్యంగా ‘కృత్రిమ ప్రచారం’ (Manufactured Marketing) వల్ల సినిమాకు జరిగే నష్టం గురించి షాహిద్ కపూర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ప్రేక్షకుల స్పందన స్వచ్ఛంగా ఉండాలి!

ఆర్టిఫీషియల్ పీఆర్‌పై తనకు ఎప్పుడూ నమ్మకం లేదని షాహిద్ స్పష్టం చేశారు. "ఒక హాల్ నిండా ఉన్న ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ మనల్ని అభినందించడం అనేది ఒక అద్భుతం. కళకు ఉన్న ప్రత్యేకత అదే. కానీ, ఎప్పుడైతే మనం కృత్రిమమైన మార్కెటింగ్ పద్ధతులతో ఆ స్వచ్ఛతను చెడగొడతామో.. అప్పుడు ఆ అనుభూతి పూర్తిగా మారిపోతుంది. మార్కెటింగ్ అవసరమే కానీ, అది ఎంతవరకు ఉండాలనేది ఆలోచించాలి" అని షాహిద్ కపూర్ వివరించారు.

మంచి సినిమాలు తీయడం లేదు!

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఏకాగ్రత (Attention Span) తగ్గిపోవడానికి కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. "ఇక్కడ రెండు వైపులా తప్పు జరుగుతోంది. ఒకవైపు సోషల్ మీడియా ప్రభావంతో ప్రేక్షకులు ఓపిక కోల్పోతున్నారు. వారికి ప్రతి నిమిషం ఏదో ఒక ఉత్సాహం కావాలి. మరోవైపు, మేకర్స్ కూడా అదే ఒత్తిడిలో పడి నాణ్యమైన సినిమాలు తీయలేకపోతున్నారు. ప్రేక్షకులు సినిమాలు చూడటం మానేశారు అనడం కంటే, మనం చూసేలాంటి మంచి సినిమాలు తీయడం లేదనేది కూడా వాస్తవం" అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు.

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ‘ఓ రోమియో’

దిగ్గజ దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ సరసన తృప్తి డిమ్రి నటిస్తోంది. వీరితో పాటు నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటాని, విక్రాంత్ మాస్సే వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks