...
...
Next Story

Singer: ఒకే గదిలో ఆరుగురం, నాన్న పెట్రోల్ కొట్టేవారు, తిండి కోసం ఫుడ్ స్టాంపులపై ఆధారపడ్డాం: సింగర్ జాస్మిన్ కన్నీటి గాథ

Singer Jasmine Sandlas Family Struggles: బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ తన గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు తిండి కోసం ఫుడ్ స్టాంపులపై ఆధారపడిన స్థితి నుంచి నేడు వేల కోట్ల వసూళ్లు రాబడుతున్న సినిమాలకు గాత్రం అందించే స్థాయికి ఎలా ఎదిగారో వివరించారు.

Published on: Apr 21, 2026, 14:20:57 IST
Advertisement

Singer Jasmine Sandlas Reveals Her Family Struggles: బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'ధురంధర్' చిత్రంలోని పాటలతో జాస్మిన్ సాండ్లాస్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాస్మిన్ తన కుటుంబం అమెరికాకు వలస వెళ్లిన కొత్తలో అనుభవించిన నరకాన్ని బయటపెట్టారు.

పిల్లల భవిష్యత్తు కోసం

ఒకే గదిలో ఆరుగురం, నాన్న పెట్రోల్ కొట్టేవారు, తిండి కోసం ఫుడ్ స్టాంపులపై ఆధారపడ్డాం: సింగర్ జాస్మిన్ కన్నీటి గాథ
ఒకే గదిలో ఆరుగురం, నాన్న పెట్రోల్ కొట్టేవారు, తిండి కోసం ఫుడ్ స్టాంపులపై ఆధారపడ్డాం: సింగర్ జాస్మిన్ కన్నీటి గాథ

భారత్‌లో తన తండ్రి లా స్కూల్ టాపర్‌గా ఉంటూ, అత్యున్నత స్థాయి ఉద్యోగం చేసేవారని జాస్మిన్ సాండ్లాస్ తెలిపారు. కానీ, పిల్లల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తర్వాత పరిస్థితి తలకిందులైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"అమెరికా వెళ్లాక నాన్న తన హోదానంతటినీ వదిలేశారు. కుటుంబ పోషణ కోసం ఒక గ్యాస్ స్టేషన్‌లో పెట్రోల్ కొట్టే పనిలో చేరారు. మంచులో సరైన షూస్ కూడా లేకుండా నాన్న కూర్చుని ఉన్న ఫోటో చూస్తే ఇప్పటికీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కేవలం మా కోసమే ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు" అని సింగర్ జాస్మిన్ సాండ్లాస్ వివరించారు.

ఒకే గదిలో ఆరుగురు.. ఫుడ్ స్టాంపులతో రేషన్

అమెరికాలో అడుగుపెట్టిన కొత్తలో భాష రాక జాస్మిన్ సాండ్లాస్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. "మేము న్యూయార్క్‌లో దిగినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. ప్రభుత్వం ఇచ్చే తక్కువ ఆదాయ వర్గాల ఇళ్లలో ఉండేవారం. ఒకే ఒక బెడ్ రూమ్ ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆరుగురం నివసించేవాళ్లం. కిరాణా కొట్టుకు వెళ్లి ఫుడ్ స్టాంపులు చూపిస్తేనే మాకు చౌకగా రేషన్ ఇచ్చే పరిస్థితి ఉండేది" అని ఆనాటి దారిద్యాన్ని సింగర్ గుర్తు చేసుకున్నారు.

కష్టాల నుంచి కోట్ల వసూళ్ల వరకు

అయితే సంగీతంపై ఉన్న మక్కువతో జాస్మిన్ సాండ్లాస్ గాయనిగా మారారు. 2014లో సల్మాన్ ఖాన్ 'కిక్' సినిమాలోని 'యార్ నా మిలే' పాటతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాస్మిన్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

3 వేల కోట్ల కలెక్షన్స్

ఇటీవల ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమాలో జాస్మిన్ పాడిన 'జైయే సజ్నా', 'షరారత్' వంటి పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' వంటి పెద్ద సినిమాల పోటీని తట్టుకుని మరీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe