టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త మ్యాజిక్ జరగబోతోంది. 'వాట్ ఝుమ్కా?', 'సోనీ సోనీ', 'మా మా మహేషా' వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు తన గళంతోనే కాదు, తన డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను మాయ చేసింది.

అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' (Dacoit) లో జోనితా గాంధీ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాటను రామ్ మిర్యాలతో కలిసి పాడటమే కాదు అడవి శేష్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది బ్యూటిపుల్ సింగర్ జోనితా గాంధీ. దీంతో జోనితా గాంధీ పేరు మారుమోగిపోతింది.
డ్యాన్సర్‌గా జోనితా విశ్వరూపం!
సాధారణంగా సింగర్లు తెర వెనుక పాడుతుంటారు, లేదా మ్యూజిక్ వీడియోల్లో కనిపిస్తుంటారు. కానీ, జోనితా గాంధీ మాత్రం ఈ సినిమాలో ఏకంగా అడివి శేష్‌తో కలిసి స్టెప్పులేశారు. 'చిచ్చుబుడ్డి' అనే పేరుతో వచ్చిన ఈ పెప్పీ ట్రాక్‌లో జోనితా గాంధీ అదిరిపోయే ఎనర్జీని ప్రదర్శించారు.
అడివి శేష్ వంటి గ్రేస్ ఉన్న హీరోతో పోటీ పడి డ్యాన్స్ చేయడానికి జోనితా చాలా రోజుల పాటు కఠినంగా ప్రాక్టీస్ చేశారని సమాచారం. స్క్రీన్ మీద ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
స్టార్ హీరోయిన్ల సరసన జోనితా..
ఇప్పటివరకు శ్రీలీల, తమన్నా, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, సమంత, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు మాత్రమే తెలుగు సినిమాల్లో స్పెషల్ (ఐటమ్) సాంగ్స్‌తో థియేటర్లను దడదడలాడించారు. ఇప్పుడు వీరి సరసన జోనితా గాంధీ కూడా ఆ లీగ్‌లోకి చేరిపోయారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక హిట్ సాంగ్ ఇచ్చే క్రేజ్ కొన్నిసార్లు ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చే పాపులారిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని జోనితా చక్కగా అందిపుచ్చుకున్నారని చెప్పాలి.
వెండితెరపై తన ముద్ర
కేవలం తన ఇండిపెండెంట్ మ్యూజిక్, లైవ్ షోలతోనే కాకుండా, ఇప్పుడు వెండితెరపై కూడా తన ముద్ర వేయడానికి జోనితా గాంధీ సిద్ధమయ్యారు. అడివి శేష్, జోనితాల మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'డెకాయిట్' సినిమాలోని ఈ 'చిచ్చుబుడ్డి' పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్
{{/usCountry}}కేవలం తన ఇండిపెండెంట్ మ్యూజిక్, లైవ్ షోలతోనే కాకుండా, ఇప్పుడు వెండితెరపై కూడా తన ముద్ర వేయడానికి జోనితా గాంధీ సిద్ధమయ్యారు. అడివి శేష్, జోనితాల మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'డెకాయిట్' సినిమాలోని ఈ 'చిచ్చుబుడ్డి' పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్
{{/usCountry}}ఇదిలా ఉంటే, భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ చిచ్చు బుడ్డి పాటను ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ రచించారు. జోనితా గాంధీ, రామ్ మిర్యాల ఆలపించారు. కాగా, ఈ మూవీలో అడవి శేష్ సరసన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.