...
...
Next Story

Srikanth Odela: ప్యారడైజ్ ట్రోలింగ్ ఎఫెక్ట్.. రూటు మార్చిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

Srikanth Odela: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాపై ట్రోల్స్ మోత మోగింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. హింసను పక్కనపెట్టి ఓ స్వచ్ఛమైన ప్రేమకథను సిద్ధం చేస్తున్నట్లు టాక్. మరోవైపు చిరుతో సినిమాను హోల్డ్ లో పెట్టారని అంటున్నారు.

Published on: Oct 29, 2026, 06:09:06 IST
Advertisement

Srikanth Odela: దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన చిత్రం 'ది ప్యారడైజ్'. అయితే ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దర్శకుడు ప్రమోషన్స్ లో చెప్పిన దానికి, థియేటర్లో చూపించిన కంటెంట్ కి అసలు పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు శ్రీకాంత్ ఓదెలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ది ప్యారడైజ్ పై ట్రోల్స్

ప్యారడైజ్ ట్రోలింగ్ ఎఫెక్ట్.. రూటు మార్చిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?
ప్యారడైజ్ ట్రోలింగ్ ఎఫెక్ట్.. రూటు మార్చిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

ముఖ్యంగా ది ప్యారడైజ్ సినిమాలో మితిమీరిన రక్తపాతం, లాజిక్ లేని యాక్షన్ సీక్వెన్సులు, సెకండాఫ్ సాగదీత ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సైతం ఈ సినిమా ఎడిటింగ్ చెత్తగా ఉందంటూ ఏకంగా 1 స్టార్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఇక నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. థియేటర్లో విపరీతంగా ట్రోల్స్ కు గురైన 24 నిమిషాల సన్నివేశాలను (ముఖ్యంగా సోనాలి కులకర్ణి డ్యాన్స్ ఫైట్) ఓటీటీ వెర్షన్ లో తొలగించినప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు.

రూటు మార్చిన శ్రీకాంత్ ఓదెల

సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన రూటు మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. యాక్షన్, రక్తపాతానికి బదులుగా ఈసారి ఒక క్యూట్ అండ్ ఇంటెన్స్ ప్రేమకథను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, 2014 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ లవ్ డ్రామాను ఆయన డెవలప్ చేస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక భారీ యాక్షన్ సినిమా రాబోతోందని గతంలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పుడు డైలమాలో పడింది. 'ది ప్యారడైజ్' సినిమాకే అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టడంతో చిరంజీవి ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు.

ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "చిరంజీవితో సినిమా ఎప్పుడు మొదలవుతుందో కచ్చితంగా చెప్పలేము. మేము ఇంకా కూర్చుని దాని గురించి చర్చించలేదు. చిరంజీవి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు" అని స్పష్టం చేశారు. దీంతో శ్రీకాంత్ ఓదెల - మెగాస్టార్ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదని లేదా ఆగిపోయిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తెలంగాణ కథలపైనే మక్కువ

మొత్తానికి శ్రీకాంత్ ఓదెల తాను పుట్టి పెరిగిన తెలంగాణ నేల కథలనే బలంగా నమ్ముకుంటున్నాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో 'దసరా' తీసి మెప్పించిన ఈ యువ దర్శకుడు, ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో తన తదుపరి సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. భారీ యాక్షన్ ని పక్కనపెట్టి లవ్ స్టోరీని ఎంచుకోవడం ఆయన కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో త్వరలోనే తేలనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks