Rajamouli Varanasi: జపాన్, అమెరికాల తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లోనూ రాజమౌళి మేనియా వేగంగా విస్తరిస్తోంది. బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళికి అంతర్జాతీయ చిత్రసీమకు చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక 'లియోన్ కాకాఫ్ అవార్డు'ను ప్రధానం చేశారు.
వారణాసి షూటింగ్

ఈ సందర్భంగా మాట్లాడిన జక్కన్న.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వారణాసి' ప్రొడక్షన్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. "ఇంకో 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ అక్టోబర్ చివరినాటికి చిత్రీకరణ పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత షెడ్యూల్ చేసిన విధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతాయి. కచ్చితంగా ఈ సినిమాను బ్రెజిల్ థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తాం" అని రాజమౌళి వెల్లడించారు.
'వారణాసి' సైన్స్ ఫిక్షన్ కాదు
గత కొన్ని నెలలుగా 'వారణాసి' సినిమా టైమ్ ట్రావెల్ లేదా సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోందంటూ జరుగుతున్న ప్రచారానికి రాజమౌళి స్వయంగా స్వస్తి పలికారు. "చాలామంది ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటున్నారు, కానీ ఇది సై-ఫై కాదు. ఇది భారతీయ పురాణాల అంశాలు (Mythological Elements) కలగలిసిన ఒక విజువల్ ఫాంటసీ మూవీ" అని జక్కన్న క్లారిటీ ఇచ్చారు.
స్టోరీ ఇదే
ఏడెనిమిది విభిన్న కథాంశాలను లేదా ఏడు వేర్వేరు సినిమాల ఎమోషన్లను ఒక్క సినిమాలో తీసుకురావడమే తమకు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ అని వారణాసి గురించి రాజమౌళి చెప్పారు.
‘‘మొదట్లో విడిపోయిన తండ్రీకొడుకుల బంధం.. ఆ తర్వాత తిరిగి ఎలా నిలబడిందనే ఎమోషనల్ జర్నీనే ఈ వారణాసి సినిమా. ఈ కథలో ఒక యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ మధ్య సాగే అత్యంత అందమైన లవ్ స్టోరీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది’’ అని రాజమౌళి తెలిపారు.
గ్లోబల్ రిలీజ్
{{/usCountry}}‘‘మొదట్లో విడిపోయిన తండ్రీకొడుకుల బంధం.. ఆ తర్వాత తిరిగి ఎలా నిలబడిందనే ఎమోషనల్ జర్నీనే ఈ వారణాసి సినిమా. ఈ కథలో ఒక యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ మధ్య సాగే అత్యంత అందమైన లవ్ స్టోరీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది’’ అని రాజమౌళి తెలిపారు.
గ్లోబల్ రిలీజ్
{{/usCountry}}గ్లోబల్ ఆడియన్స్ టేస్ట్‌కు తగినట్లుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ వర్సటైల్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ అత్యంత కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు.
ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి ఈ వారణాసికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.