Oscar Award Winner Costa Gavras Rajamouli Movies: టాలీవుడ్ జక్కన్న, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆయనకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అత్యంత అరుదైన గౌరవం లభించింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర సంస్థల్లో ఒకటిగా పేరొందిన 'సినిమేటెక్ ఫ్రాంకైజ్' (Cinémathèque Française) రాజమౌళికి శాశ్వత స్థానాన్ని కల్పించింది. భారతీయ సినిమా ఎదుగుదలను కొనియాడుతూ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత, గ్రీక్-ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ పాల్గొనడం విశేషం.
ప్రపంచ ప్రఖ్యాత చలనచిత్ర సంస్థలో శాశ్వత స్థానం
రాజమౌళి చిత్రాలను ఏకధాటిగా దాదాపు ఎనిమిది గంటల పాటు వీక్షించిన ఆయన, ఆ తర్వాత జరిగిన మాస్టర్‌క్లాస్‌లోనూ కూర్చుని జక్కన్న ప్రతిభను అభినందించారు. పారిస్ నగరంలో 1936లో హెన్రీ లాంగ్లోయిస్ స్థాపించిన 'సినిమేటెక్ ఫ్రాంకైజ్' ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రపంచ సినిమా రంగాన్ని మలుపు తిప్పిన గొప్ప కథా రచయితలు, దర్శకులను మాత్రమే ఈ సంస్థ గౌరవిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఇండియన్ సినిమా రైజ్‌ను సెలబ్రేట్ చేస్తూ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' (2012), 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'ఆర్ఆర్ఆర్' (2022) చిత్రాలను ప్రదర్శించారు.
రాజమౌళి భావోద్వేగం
మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి మద్దతు అందించాయి. ఈ అరుదైన గౌరవంపై రాజమౌళి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగంతో స్పందించారు.
"నన్ను పారిస్‌కు ఆహ్వానించి నా సినిమాలు ప్రదర్శించడమే నాకొక గొప్ప గౌరవం. కానీ నేను ఊహించని ఒక మధురమైన ఆశ్చర్యం ఇక్కడ ఎదురైంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. మహానుభావుడు హెన్రీ లాంగ్లోయిస్ పేరు మీదున్న ప్రపంచపు అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక చలనచిత్ర సంస్థలో నాకు శాశ్వత స్థానం కల్పించడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం" అని రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు.
8 గంటల పాటు థియేటర్లోనే ఉండిపోయిన ఆస్కార్ విజేత
{{/usCountry}}"నన్ను పారిస్‌కు ఆహ్వానించి నా సినిమాలు ప్రదర్శించడమే నాకొక గొప్ప గౌరవం. కానీ నేను ఊహించని ఒక మధురమైన ఆశ్చర్యం ఇక్కడ ఎదురైంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. మహానుభావుడు హెన్రీ లాంగ్లోయిస్ పేరు మీదున్న ప్రపంచపు అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక చలనచిత్ర సంస్థలో నాకు శాశ్వత స్థానం కల్పించడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం" అని రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు.
8 గంటల పాటు థియేటర్లోనే ఉండిపోయిన ఆస్కార్ విజేత
{{/usCountry}}లెజెండరీ దర్శకుడు కోస్టా గావ్రాస్‌తో పాటు సినీమేటెక్ ఫ్రాంకైజ్ బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన ఒకటుంది.
'జెడ్' (1969), 'మిస్సింగ్' (1982) వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన 93 ఏళ్ల ఆస్కార్ అవార్డు గ్రహీత, ఫ్రెంచ్-గ్రీక్ చిత్రనిర్మాత కోస్టా గావ్రాస్ కేవలం మర్యాదపూర్వకంగా హాజరవుతారని చిత్ర యూనిట్ భావించింది. కానీ, రాజమౌళి సినిమాల మాయలో పడి ఆయన రోజంతా థియేటర్లోనే గడిపేశారు. ఈ అద్భుత క్షణాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
"93 ఏళ్ల అకాడమీ అవార్డు విజేత కోస్టా గావ్రాస్ నిన్న ఆర్ఆర్ఆర్ సినిమా చూడటానికి వచ్చారు. ఈ రోజు బాహుబలి సినిమాను స్కిప్ చేసి, రేపు ఈగ సినిమా చూడటానికి వస్తానని రాజమౌళితో చెప్పారు. కానీ, మా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన ఈ రోజు తన భార్యతో కలిసి థియేటర్‌కు వచ్చారు. ఏకధాటిగా 8 గంటల పాటు కూర్చుని బాహుబలి, ఈగ సినిమాలతో పాటు మాస్టర్‌క్లాస్‌ను కూడా వీక్షించారు" అని కార్తికేయ ట్వీట్ చేశారు.
గ్లోబల్ బాక్సాఫీస్ వైపు 'వారణాసి' అడుగులు
సినిమా రంగంలో తాము కొనసాగడానికి, మరింతగా శ్రమించడానికి ఇలాంటి క్షణాలే స్ఫూర్తినిస్తాయని ఆయన రాసుకొచ్చారు. పారిస్ వేదికగా అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న రాజమౌళి, ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేస్తున్నారు.
ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.