...
...
Next Story

System OTT Trailer: ఓటీటీలోకి జ్యోతిక, సోనాక్షి కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సిస్టమ్ ట్రైలర్ రిలీజ్- లాయర్‌కు 10 కేసుల ఛాలెంజ్

Jyotika Sonakshi Sinha System Movie OTT Trailer Released: ఇద్దరు స్టార్ హీరోయిన్లు జ్యోతిక, సోనాక్షి సిన్హా కలిసి నటించిన ఓటీటీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం సిస్టమ్. తాజాగా ఇవాళ సిస్టమ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ సిస్టమ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడో తెలుసుకుందాం.

Published on: May 12, 2026, 14:44:07 IST
Advertisement

Jyotika Sonakshi Sinha OTT Movie System Trailer Released: వెండితెరపై కోర్టు రూమ్ డ్రామాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. సత్యం, అసత్యాల మధ్య జరిగే పోరాటాన్ని, పదునైన వాదనలను చూడటాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు.

ఓటీటీలోకి నేరుగా

ఓటీటీలోకి జ్యోతిక, సోనాక్షి కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సిస్టమ్ ట్రైలర్ రిలీజ్- లాయర్‌కు 10 కేసుల ఛాలెంజ్
ఓటీటీలోకి జ్యోతిక, సోనాక్షి కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సిస్టమ్ ట్రైలర్ రిలీజ్- లాయర్‌కు 10 కేసుల ఛాలెంజ్

అయితే, ఓటీటీలోకి నేరుగా సరికొత్త కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'సిస్టమ్' (System) స్ట్రీమింగ్‌కు రానుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ జ్యోతిక, బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా (ఇవాళ మే 12) సిస్టమ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

లాయర్ అయిన సోనాక్షి సిన్హాకు 10 కేసులు గెలవాలని వచ్చే ఛాలెంజ్‌తో ప్రారంభమైన సిస్టమ్ ట్రైలర్ ఉత్కంఠభరితమైన అనుభూతిని ఇస్తోంది. 'నిల్ బట్టే సన్నాటా', 'బరేలీ కీ బర్ఫీ' వంటి విభిన్న చిత్రాలను అందించిన అశ్విని అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. కేవలం వాదోపవాదాలే కాకుండా, వ్యవస్థలోని లోపాలను, మనుషుల మధ్య ఉండే క్లిష్టమైన సంబంధాలను ఈ చిత్రంలో చర్చించారు.

కథాంశం: అధికారం వర్సెస్ న్యాయం

సిస్టమ్ ట్రైలర్ గమనిస్తే, సోనాక్షి సిన్హా ఇందులో ఒక పట్టుదల గల యంగ్ లాయర్ 'నేహా' పాత్రలో కనిపిస్తున్నారు. తన తండ్రి (అశుతోష్ గోవరికర్) నడుపుతున్న ప్రతిష్టాత్మక లా ఫర్మ్‌లో తను పని చేయాలంటే దానికి ఓ అర్హత ఉండాలని, అది అందరూ భావించాలని చెబుతాడు.

ఒక్క కేసు ఓడిపోకుండా 10 కేసులు గెలిచే కఠినమైన సవాల్‌ను స్వీకరిస్తుంది లాయర్ నేహా. అలా గెలిచేందుకు కోర్టు స్టెనోగ్రాఫర్ సారికా (జ్యోతిక) హెల్ప్ తీసుకుంటుంది నేహా. "నువ్వు కేసు గెలవాలా? బాధితులకు న్యాయం జరగాలా?" అని జ్యోతిక అడిగే డైలాగ్ మంచి ఇంటెన్స్ క్రియేట్ చేసింది. కేసు గెలవాలని, ఒక్కో కేసుకు రూ. 10 వేలు ఇస్తానని సోనాక్షి అంటే రూ. 20 వేలకు బేరం ఆడుతుంది జ్యోతిక.

బలమైన గతం ఉందా?

"న్యాయం అనేది దేవుడు లాంటిది. కనిపెట్టడం చాలా కష్టం" అని సిస్టమ్ ట్రైలర్‌ ఎండింగ్‌లో వచ్చే డైలాగ్ మాములుగా లేదు. ఇలా బెస్ట్ డైలాగ్స్, సస్పెన్స్ సీన్స్, ఇంటెన్స్ బీజీఎమ్‌తో సిస్టమ్ ట్రైలర్ అదిరిపోయింది.

ఇద్దరు పవర్ ఫుల్ లేడీస్.. ఒకే స్క్రీన్ పై!

అయితే, దక్షిణాదిలో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతిక, బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కలిసి నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. "నేహా పాత్ర నా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సమాజంలోని అసమానతలను, న్యాయ వ్యవస్థలోని సవాళ్లను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది" అని సోనాక్షి సిన్హా తన పాత్ర గురించి పేర్కొన్నారు.

జ్యోతిక మాట్లాడుతూ, "సారిక వంటి లేయర్డ్ పాత్రను పోషించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆధునిక భారతదేశంలో అధికారం ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ చిత్రం చూపిస్తుంది" అని చెప్పారు.

మే 22న ఓటీటీలోకి

హర్మన్ బావేజా కథ రాసిన సిస్టమ్ ఓటీటీ సినిమాలో అశుతోష్ గోవరికర్ మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో సిస్టమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మే 22న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి హిందీ భాషలో సిస్టమ్ ఓటీటీ రిలీజ్ అవనుంది.

ఓటీటీ కోర్టు రూమ్ థ్రిల్లర్లకు ఆదరణ

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటీటీ కోర్టు రూమ్ థ్రిల్లర్లకు మంచి ఆదరణ ఉండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారం న్యాయాన్ని చంపేస్తుందా లేక నిజం తన దారిని వెతుక్కుంటుందా అనేది తెలియాలంటే మే 22 వరకు వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe