...
...
Next Story

OTT Court: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సోనాక్షి సిన్హా, జ్యోతిక న్యాయ పోరాటం- తెలుగులోనూ స్ట్రీమింగ్

Courtroom Thriller Drama System OTT Streaming Today: సోనాక్షి సిన్హా, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కోర్టు రూమ్ థ్రిల్లర్ డ్రామా సిస్టమ్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిస్టమ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 22, 2026, 12:29:52 IST
Advertisement

Sonakshi Jyothika System OTT Release Today: సినిమా హాల్స్‌లో లీగల్ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. నైతికతకు, చట్టానికి మధ్య జరిగే పోరాటాలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు అమితాసక్తి చూపిస్తారు. ఇప్పుడు అదే తరహాలో ఓ బలమైన మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన బాలీవుడ్ ఓటీటీ చిత్రం 'సిస్టమ్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది.

నేరుగా ఓటీటీలోకి

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సోనాక్షి సిన్హా, జ్యోతిక న్యాయ పోరాటం- తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సోనాక్షి సిన్హా, జ్యోతిక న్యాయ పోరాటం- తెలుగులోనూ స్ట్రీమింగ్

బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక కలయికలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఈ చిత్రానికి వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించారు.

వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు మహిళల చుట్టూ, వారి మధ్య నడిచే ఒక వివాదాస్పద కోర్టు కేసు నేపథ్యంలో ఈ సిస్టమ్ సినిమా సాగుతుంది. అధికారం, హోదా, సమాజంలో ఉండే అసమానతలు న్యాయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే పాయింట్‌ను ఇందులో దర్శకురాలు అద్భుతంగా చూపించారు.

అసలు 'సిస్టమ్' కథ ఏంటంటే?

ఈ సినిమాలో సోనాక్షి సిన్హా 'నేహా రాజ్‌వంశ్' అనే ప్రతిష్టాత్మకమైన, దూకుడు స్వభావం గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో కనిపించారు. పెద్ద పెద్ద కేసులను గెలిచి కెరీర్‌లో దూసుకుపోవడమే ఆమె లక్ష్యం. అలాంటి నేహా జీవితంలోకి 'సారికా రావత్' (జ్యోతిక) అనే ఒక సామాన్య కోర్టు స్టెనోగ్రాఫర్ ప్రవేశిస్తుంది. ఒక సున్నితమైన కేసు దర్యాప్తు సమయంలో వీరిద్దరి మార్గాలు ఒకదానితో ఒకటి ముడిపడతాయి.

సోనాక్షి, జ్యోతికలతో పాటు ఈ చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఓ కీలక పాత్రలో మెరిశారు. ప్రీతి అగర్వాల్, ఆదినాథ్ కోఠారే, గౌరవ్ పాండే ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. బావేజా స్టూడియోస్, అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

"భిన్నమైన మనస్తత్వాలు, న్యాయం పట్ల వేర్వేరు ఆలోచనలు ఉన్న ఇద్దరు బలమైన మహిళల మధ్య సాగే ఉత్కంఠభరితమైన పోరాటమే ఈ సినిమా" అని నిర్మాత హర్మాన్ బావేజా వెల్లడించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ మాట్లాడుతూ.. ప్రతి దశలోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ సస్పెన్స్ డ్రామా సాగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఎక్కడ.. ఎప్పుడు చూడొచ్చు?

సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన సిస్టమ్ ఓటీటీలోకి ఇవాళ (మే 22) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో సిస్టమ్ ఓటీటీ రిలీజ్ అయింది. హిందీతోపాటు తెలుగు, తమిళం వంటి మూడు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిస్టమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

దాదాపు రెండు గంటల నుంచి రెండున్నర గంటల (120 - 150 నిమిషాలు) రన్‌టైమ్‌తో ఉన్న ఈ హిందీ చిత్రం సిస్టమ్ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్‌లో ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks