Taapsee Pannu About Secret Wedding Photos: సినీ తారల వివాహాలు అనగానే భారీ హంగామా, సోషల్ మీడియాలో కలర్‌ఫుల్ ఫోటోల వరద కనిపిస్తుంటుంది. అయితే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన బాట ఎంచుకున్నారు.
అత్యంత ఆత్మీయుల మధ్య

డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను ఉదయ్‌పూర్‌లో అత్యంత ఆత్మీయుల మధ్య తాప్సీ పన్ను వివాహం చేసుకున్నారు. చాలామంది సినీ ప్రముఖులకు వీరి పెళ్లికి ఆహ్వానం అందలేదు. అంత పెద్ద వేడుక జరిగినా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో ఎందుకు పంచుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో ఉండిపోయింది. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాప్సీ ఈ విషయమై స్పందించారు.
వ్యక్తిగత జీవితంపై స్పష్టమైన గీత
తమ పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించకపోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని తాప్సీ చెప్పుకొచ్చారు. "నా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన కెరీర్‌ను ఎప్పుడూ వేర్వేరుగానే చూస్తాను. పెళ్లి విషయాన్ని దాచాలనో, భయంతోనో నేను ఈ పని చేయలేదు. వివాహం అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ప్రెస్ నోట్లు విడుదల చేయడం, ఫోటోలు, వీడియోల ఆల్బమ్‌లను అందరి ముందూ ఉంచడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది" అని తాప్సీ పేర్కొన్నారు.
అతిథుల ప్రవర్తనతో ఇబ్బందికర పరిస్థితి
ఈ వేడుకకు హాజరైన అతిథులు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని ముందే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఒక వీడియో బయటకు లీక్ కావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై తాప్సీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఫోన్లు లాక్కోడవం పద్ధతి కాదు
"ఆ వీడియో లీక్ కావడం నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఆహ్వానించిన కొందరు వ్యక్తుల వల్ల ఇలా జరిగింది. చెప్పిన చిన్న విజ్ఞప్తిని కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. అతిథుల ఫోన్లు లాక్కోవడం పద్ధతి కాదు, అది పిల్లచేష్టలా ఉంటుంది. మనం ఆప్యాయంగా చెప్పినప్పుడు ఎదుటివారు గౌరవిస్తారని నమ్మాను" అని తాప్సీ వివరించారు.
భర్త గోప్యతకు ప్రాధాన్యం
{{/usCountry}}"ఆ వీడియో లీక్ కావడం నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఆహ్వానించిన కొందరు వ్యక్తుల వల్ల ఇలా జరిగింది. చెప్పిన చిన్న విజ్ఞప్తిని కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. అతిథుల ఫోన్లు లాక్కోవడం పద్ధతి కాదు, అది పిల్లచేష్టలా ఉంటుంది. మనం ఆప్యాయంగా చెప్పినప్పుడు ఎదుటివారు గౌరవిస్తారని నమ్మాను" అని తాప్సీ వివరించారు.
భర్త గోప్యతకు ప్రాధాన్యం
{{/usCountry}}తన భర్త మథియాస్ బోయ్ క్రీడాకారుడు కావడంతో ఆయన ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చానని తాప్సీ వెల్లడించారు. సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఉండే ఆసక్తి క్రీడాకారుల విషయంలో అంతగా ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మీడియా దృష్టిని తట్టుకోవడం తనకు అలవాటైనప్పటికీ, తన భర్తను అటువంటి విశ్లేషణలు, కెమెరాల ఒత్తిడికి గురిచేయడం తనకు ఇష్టం లేదని తాప్సీ పన్ను చెప్పారు.
వరుస సినిమాలతో బిజీగా తాప్సీ
వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే తాప్సీ వరుస విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఇటీవల అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన 'అస్సి' చిత్రంలో రావి భట్కల్ అనే లాయర్ పాత్రలో మెప్పించారు.
ఓటీటీల్లో తాప్సీ సినిమాలు
మరోవైపు దేవాశిష్ మఖిజా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి'లో కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను కాపాడుకునే తల్లిగా పవర్‌ఫుల్ నటనను కనబరిచారు. నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్టర్‌గా గాంధారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, థియేటర్లలో విడుదలైన తర్వాత జీ5లో అస్సీ ఓటీటీ రిలీజ్ అయింది.