Taapsee: పెళ్లి ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు? సీక్రెట్‌ వెడ్డింగ్‌పై తాప్సీ కామెంట్స్- అతిథుల ఫోన్లు లాక్కోవడం అలాంటిదంటూ!

Taapsee Pannu About Secret Wedding Photos: డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బోయ్‌తో వివాహం తర్వాత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోకపోవడానికి గల కారణాలను హీరోయిన్ తాప్సీ పన్ను వెల్లడించారు. సీక్రెట్ వెడ్డింగ్‌గా ఉంచడం, లీకైన వీడియోపై ఆమె స్పందించిన తీరు విశేషాలపై లుక్కేద్దాం.

Published on: Sep 28, 2026, 06:20:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Taapsee Pannu About Secret Wedding Photos: సినీ తారల వివాహాలు అనగానే భారీ హంగామా, సోషల్ మీడియాలో కలర్‌ఫుల్ ఫోటోల వరద కనిపిస్తుంటుంది. అయితే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన బాట ఎంచుకున్నారు.

పెళ్లి ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు? సీక్రెట్‌ వెడ్డింగ్‌పై తాప్సీ కామెంట్స్- అతిథుల ఫోన్లు లాక్కోవడం అలాంటిదంటూ!
పెళ్లి ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు? సీక్రెట్‌ వెడ్డింగ్‌పై తాప్సీ కామెంట్స్- అతిథుల ఫోన్లు లాక్కోవడం అలాంటిదంటూ!

అత్యంత ఆత్మీయుల మధ్య

డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను ఉదయ్‌పూర్‌లో అత్యంత ఆత్మీయుల మధ్య తాప్సీ పన్ను వివాహం చేసుకున్నారు. చాలామంది సినీ ప్రముఖులకు వీరి పెళ్లికి ఆహ్వానం అందలేదు. అంత పెద్ద వేడుక జరిగినా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో ఎందుకు పంచుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో ఉండిపోయింది. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాప్సీ ఈ విషయమై స్పందించారు.

వ్యక్తిగత జీవితంపై స్పష్టమైన గీత

తమ పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించకపోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని తాప్సీ చెప్పుకొచ్చారు. "నా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన కెరీర్‌ను ఎప్పుడూ వేర్వేరుగానే చూస్తాను. పెళ్లి విషయాన్ని దాచాలనో, భయంతోనో నేను ఈ పని చేయలేదు. వివాహం అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ప్రెస్ నోట్లు విడుదల చేయడం, ఫోటోలు, వీడియోల ఆల్బమ్‌లను అందరి ముందూ ఉంచడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది" అని తాప్సీ పేర్కొన్నారు.

అతిథుల ప్రవర్తనతో ఇబ్బందికర పరిస్థితి

ఈ వేడుకకు హాజరైన అతిథులు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని ముందే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఒక వీడియో బయటకు లీక్ కావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై తాప్సీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఫోన్లు లాక్కోడవం పద్ధతి కాదు

"ఆ వీడియో లీక్ కావడం నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఆహ్వానించిన కొందరు వ్యక్తుల వల్ల ఇలా జరిగింది. చెప్పిన చిన్న విజ్ఞప్తిని కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. అతిథుల ఫోన్లు లాక్కోవడం పద్ధతి కాదు, అది పిల్లచేష్టలా ఉంటుంది. మనం ఆప్యాయంగా చెప్పినప్పుడు ఎదుటివారు గౌరవిస్తారని నమ్మాను" అని తాప్సీ వివరించారు.

భర్త గోప్యతకు ప్రాధాన్యం

తన భర్త మథియాస్ బోయ్ క్రీడాకారుడు కావడంతో ఆయన ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చానని తాప్సీ వెల్లడించారు. సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఉండే ఆసక్తి క్రీడాకారుల విషయంలో అంతగా ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మీడియా దృష్టిని తట్టుకోవడం తనకు అలవాటైనప్పటికీ, తన భర్తను అటువంటి విశ్లేషణలు, కెమెరాల ఒత్తిడికి గురిచేయడం తనకు ఇష్టం లేదని తాప్సీ పన్ను చెప్పారు.

వరుస సినిమాలతో బిజీగా తాప్సీ

వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే తాప్సీ వరుస విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఇటీవల అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన 'అస్సి' చిత్రంలో రావి భట్కల్ అనే లాయర్ పాత్రలో మెప్పించారు.

ఓటీటీల్లో తాప్సీ సినిమాలు

మరోవైపు దేవాశిష్ మఖిజా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి'లో కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను కాపాడుకునే తల్లిగా పవర్‌ఫుల్ నటనను కనబరిచారు. నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్టర్‌గా గాంధారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, థియేటర్లలో విడుదలైన తర్వాత జీ5లో అస్సీ ఓటీటీ రిలీజ్ అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More