...
...
Next Story

Rahul Dev Mahesh Babu: మహేశ్ బాబుకు హిందీ రాదు, అందుకే బాలీవుడ్ భరించలేదన్నాడు- టక్కరి దొంగ విలన్ రాహుల్ దేవ్ కామెంట్స్

Rahul Dev On Mahesh Babu Bollywood Debut Comments: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై టక్కరి దొంగ విలన్, నటుడు రాహుల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ పరిశ్రమ తనను భరించలేదని మహేశ్ బాబు గతంలో పేర్కొన్నప్పటికీ, అసలు కారణం భాష సమస్యేనని రాహుల్ దేవ్ అభిప్రాయపడ్డారు.

Published on: May 14, 2026 02:22 PM IST
Advertisement

Rahul Dev On Mahesh Babu Bollywood Debut Comments: తెలుగు చిత్ర పరిశ్రమలో 'ప్రిన్స్' నుంచి 'సూపర్ స్టార్' వరకు ఎదిగిన మహేశ్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు హిందీలోకి డబ్ అయి యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధిస్తుంటాయి. అయితే, నేరుగా బాలీవుడ్ సినిమా మాత్రం మహేశ్ బాబు ఎప్పుడు చేయలేదు.

బాలీవుడ్ నన్ను భరించలేదు

మహేశ్ బాబుకు హిందీ రాదు, అందుకే బాలీవుడ్ భరించలేదన్నాడు- టక్కరి దొంగ విలన్ రాహుల్ దేవ్ కామెంట్స్
మహేశ్ బాబుకు హిందీ రాదు, అందుకే బాలీవుడ్ భరించలేదన్నాడు- టక్కరి దొంగ విలన్ రాహుల్ దేవ్ కామెంట్స్

గతంలో కూడా బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ "బాలీవుడ్ నన్ను భరించలేదు (Bollywood can't afford me)" అంటూ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ విషయంపై మహేశ్ బాబు నటించిన టక్కరి దొంగ విలన్ రాహుల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

త్రివిక్రమ్ మార్క్ సినిమా.. బాలీవుడ్ మిస్సింగ్!

2002లో వచ్చిన 'టక్కరి దొంగ' చిత్రంలో మహేశ్ బాబుతో కలిసి నటించిన రాహుల్ దేవ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ గురించి మాట్లాడారు. మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగా మెప్పించాయో ఆయన గుర్తు చేశారు.

"దర్శకుడు త్రివిక్రమ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటు ఒక అర్థం ఉంటుంది. అటువంటి సినిమాలు హిందీలో రావడం లేదు. అక్కడ రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ లాంటి వారి ఒక మార్క్ సినిమాలు లేదా హాలీవుడ్ సినిమాల రీమేక్‌లు మాత్రమే ఉంటున్నాయి" అని రాహుల్ దేవ్ విశ్లేషించారు.

అసలు గుట్టు భాషా సమస్యేనా?

మహేశ్ బాబు ఎదుగుదల, ఆయనకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చే గౌరవం ముందు మరో పరిశ్రమకు వెళ్లి భాష నేర్చుకుని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదనే కోణంలో రాహుల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, గతంలో అడవి శేష్ 'మేజర్' సినిమా ట్రైలర్ లాంచ్ సమయంలో మహేష్ బాబు తన బాలీవుడ్ అరంగేట్రంపై స్పష్టతనిచ్చారు.

తెలుగు సినిమాపై మహేశ్ అపార నమ్మకం

"నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఇది గర్వంగా అనిపించవచ్చు కానీ, వాళ్లు నన్ను భరించలేరు. నా సమయాన్ని వృథా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తెలుగు సినిమాలో నాకు లభిస్తున్న స్టార్‌డమ్, అభిమానం చూశాక మరో పరిశ్రమకు వెళ్లాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడే సినిమాలు చేస్తానని, అవి పెద్ద విజయాలు సాధిస్తాయని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమవుతోంది" అని మహేశ్ బాబు అన్న విషయం తెలిసిందే.

రాజమౌళితో ప్రపంచ యాత్రకు సిద్ధం

ఇదిలా ఉంటే, ప్రస్తుతం మహేశ్ బాబు యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న ఎస్ఎస్ రాజమౌళి వారణాసి కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఒక భారీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా ఈ సినిమాతో భారతీయ వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

వారాణాసి రిలీజ్ డేట్

పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్‌గా చేస్తున్న వారణాసి చిత్రంలో మహేశ్ బాబు 'రుద్ర', 'శ్రీరాముడు' అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. వారణాసి 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe