...
...
Next Story

మహా శివరాత్రి వేళ తమన్నా, శ్రీనిధి శెట్టి, సారా అర్జున్ డ్యాన్స్- ఇషా ఫౌండేషన్‌లో స్టార్ హీరోయిన్ల సందడి! (వీడియోలు)

ఇషా ఫౌండేషన్ వేడుకల్లో సినీ ప్రముఖులు ఆధ్యాత్మిక భక్తిలో మునిగిపోయారు. తమన్నా భాటియా, సారా అర్జున్, శ్రీనిధి శెట్టి వంటి స్టార్ హీరోయిన్లు సద్గురు సమక్షంలో డ్యాన్స్ చేస్తూ శివరాత్రి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 16, 2026, 13:59:00 IST
Advertisement

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. సద్గురు సమక్షంలో జరిగిన ఈ భారీ ఆధ్యాత్మిక ఉత్సవానికి వెండితెర తారలు తరలివచ్చారు. భక్తి, సంస్కృతి మేళవింపుగా సాగిన ఈ వేడుకల్లో తమన్నా భాటియా, సారా అర్జున్, శ్రీనిధి శెట్టి, మౌనీ రాయ్ వంటి హీరోయిన్స్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆధ్యాత్మిక హోరు.. తారల జోరు!

మహా శివరాత్రి వేళ తమన్నా, శ్రీనిధి శెట్టి, సారా అర్జున్ డ్యాన్స్- ఇషా ఫౌండేషన్‌లో స్టార్ హీరోయిన్ల సందడి! (వీడియోలు)
మహా శివరాత్రి వేళ తమన్నా, శ్రీనిధి శెట్టి, సారా అర్జున్ డ్యాన్స్- ఇషా ఫౌండేషన్‌లో స్టార్ హీరోయిన్ల సందడి! (వీడియోలు)

శివనామ స్మరణ, సంగీత విభావరితో మార్మోగిన ఆ రాత్రి.. స్టార్ హీరోయిన్ తమన్నా, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి, ధురంధర్ భామ సారా అర్జున్ డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉత్సాహంగా చిందులు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మిక శక్తిని ఆస్వాదిస్తూ, ఎంతో వినమ్రంగా వారు డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తండ్రితో కలిసి

ఒక వీడియోలో 'ధురంధర్' స్టార్ సారా అర్జున్ తన తండ్రి రాజ్ అర్జున్‌తో కలిసి ప్రదర్శనలను తిలకిస్తూ కనిపించింది. ఆమె సరిగ్గా తమన్నా వెనుక సీటులో కూర్చుని ఉండగా, తమన్నా ఎవరితోనో సంభాషణలో నిమగ్నమై ఉంది.

తమన్నా డ్యాన్స్ గమనించిన సారా

మరో క్లిప్‌లో తమన్నా డ్యాన్స్ చేస్తుంటే సారా అర్జున్ ఆసక్తిగా గమనిస్తోంది. ఇంకో వీడియోలో సారా అర్జున్,'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. నాగిని బ్యూటీ మౌనీ రాయ్ సైతం తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.

ఎంతో ధన్యురాలిని

ఆధ్యాత్మిక విరామం తర్వాత ఈ భామలు తమ తదుపరి చిత్రాలతో బిజీ కానున్నారు. తమన్నా భాటియా: సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘వ్యాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే ఫోక్ థ్రిల్లర్‌లో నటిస్తోంది తమన్నా భాటియా. ఈ సినిమా 2026, మే 15న విడుదల కానుంది.

సారా అర్జున్ మూవీ

రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో నటిస్తోంది బ్యూటిఫుల్ సారా అర్జున్. ఈ సినిమా 2026, మార్చి 19న తెరపైకి రానుంది.

శ్రీనిధి శెట్టి, మౌనీ రాయ్

విక్టరీ వెంకటేష్ - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47’లో కీలక పాత్ర పోషిస్తోంది శ్రీనిధి శెట్టి. ఇక హాట్ బ్యూటీ మౌనీ రాయ్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్‌తో కలిసి ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా జూన్ 5, 2026న ఇది విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks