...
...
Next Story

Tamanna: బిగ్ బాస్‌లో తమన్నా ఫేవరెట్ కంటెస్టెంట్ అతడే.. నా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో మొత్తం అతని వీడియోలే అంటూ కామెంట్స్

Tamannaah Bhatia Bigg Boss Favourite Contestant: స్టార్ హీరోయిన్ తమన్నా తన ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో చెప్పేసింది. 'ది వాన్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా భాటియా బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, అది ఎందుకో కూడా చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా.

Published on: Sep 21, 2026, 06:25:29 IST
Advertisement

Tamannaah Bhatia Bigg Boss Favourite Contestant: రియాలిటీ ఓటీటీ షో బిగ్ బాస్ సీజన్ 20 రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ షో ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే తన విచిత్రమైన ప్రవర్తన, నాటకాలతో కశ్మీరీ సింగర్ ఖాజీ తౌకీర్ ప్రధాన ఆకర్షణగా మారాడు.

భయపెట్టడం, ఫేక్ ఎమర్జెన్సీలు

బిగ్ బాస్‌లో తమన్నా ఫేవరెట్ కంటెస్టెంట్ అతడే.. నా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో మొత్తం అతని వీడియోలే అంటూ కామెంట్స్
బిగ్ బాస్‌లో తమన్నా ఫేవరెట్ కంటెస్టెంట్ అతడే.. నా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో మొత్తం అతని వీడియోలే అంటూ కామెంట్స్

హౌస్‌మేట్స్‌ను భయపెట్టడం, ఫేక్ ఎమర్జెన్సీలతో అటెన్షన్ డ్రా చేయడంలో ఖాజీ ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. తాజాగా జరిగిన 'వీకెండ్ కా వారె' ఎపిసోడ్‌లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ తమన్నా భాటియా సైతం ఖాజీ హంగామాపై ప్రత్యేకంగా స్పందించారు.

"నా టైమ్‌లైన్ అంతా ఖాజీయే": తమన్నా ప్రశంసలు

తమ రాబోయే చిత్రం 'ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' ప్రమోషన్‌లో భాగంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడిన తమన్నా, ప్రస్తుతం సోషల్ మీడియాను బిగ్ బాస్ ఏలేస్తోందని వ్యాఖ్యానించారు.

"ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ టైమ్‌లైన్ ఓపెన్ చేస్తే చాలు ఖాజీ తౌకీర్ వీడియోలే దర్శనమిస్తున్నాయి" అని తమన్నా నవ్వుతూ చెప్పారు.

ఇదే సమయంలో ఖాజీ ఆడిన ఫేక్ మెడికల్ డ్రామాను హోస్ట్ సల్మాన్ ఖాన్ సరదాగా రీక్రియేట్ చేశారు. కంటెస్టెంట్లతో మాట్లాడే క్రమంలో సల్మాన్ ఒక్కసారిగా ఛాతీ పట్టుకుని తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు నటించారు.

మంచి నీళ్లు కావాలని అడుగుతూ, జాకెట్ తీసి నేలపై పడిపోవడంతో హౌస్‌మేట్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత చిరునవ్వుతో పైకి లేచిన సల్మాన్, తనకు ఏమీ కాలేదని, ఖాజీ ఆడిన నాటకాన్ని మాత్రమే తాను చేసి చూపించానని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తొలి వారంలో ఖాజీ అర్థరాత్రి వేళ తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయంటూ హౌస్‌మేట్స్‌ను భయపెట్టాడు. ఆ మరుసటి రోజు అత్యవసర వైద్యం కావాలంటూ బిగ్ బాస్‌పై గట్టిగా కేకలు వేశాడు. అయితే మెడికల్ రూమ్‌కు వెళ్లాక, తనకు ఏమీ కాలేదని, కేవలం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికే అలా నటించానని డాక్టర్లకు చెప్పడం గమనార్హం.

'ఫేమ్ గురుకుల్' విజేత నుంచి బిగ్ బాస్ సెలబ్రిటీ వరకు

2005లో వచ్చిన ఐకానిక్ సింగింగ్ రియాలిటీ షో 'ఫేమ్ గురుకుల్' విజేతగా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఖాజీ తౌకీర్. బాలీవుడ్ ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ కూడా పాల్గొన్న ఆ సీజన్‌లో రూప్రేఖ బెనర్జీతో కలిసి ఖాజీ విజేతగా నిలిచాడు.

బిగ్ బాస్ 20లో తానో కమాండోనంటూ

ప్రస్తుతం బిగ్ బాస్ 20లో తానో కమాండోనంటూ చిత్రవిచిత్రమైన కథలు చెప్పడం, రాత్రిళ్లు మిగతా కంటెస్టెంట్లను నిద్రపోనివ్వకపోవడం వంటి విన్యాసాలతో వీక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు ఖాజీ తౌకీర్. అందుకే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఖాజీ అంటే తమన్నా ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks