ఏప్రిల్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో డిఫరెంట్ కంటెంట్ ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్‌కు అవుతున్నాయి. తెలుగులో 6 సినిమాలు రిలీజ్ కాగా అవి ఒక్కో ఓటీటీలో రెండేసి సినిమాల చొప్పున ప్రీమియర్ అవుతున్నాయి. ఈ ఆరులో 4 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మృత్యుంజయ్: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమానే మృత్యుంజయ్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హత్యల చుట్టు సాగే మృత్యుంజయ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3న మృత్యుంజయ్ ఓటీటీ రిలీజ్ అయింది.
మామ్లా లీగల్ హై - సీజన్ 2: హిందీలో సూపర్ హిట్ అయిన కోర్ట్ రూమ్ లీగల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై. దీనికి రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. అది తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో అలరించేందుకు సిద్ధమైంది ఈ సిరీస్ రెండో సీజన్. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3 నుంచి తెలుగులో మామ్లా లీగల్ హై 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కోర్టు లోపల జరిగే సరదా సంఘటనలు, డ్రామా ఈ సిరీస్ ప్రత్యేకత.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
క్రైమ్ 101: ఇంగ్లీష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం క్రైమ్ 101. భారీ దొంగతనాలు, వాటి చుట్టూ తిరిగే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 1న క్రైమ్ 101 ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం తెలుగులో కూడా క్రైమ్ 101 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఎస్ సరస్వతి: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో, ప్రియమణి కీ రూల్ చేసిన తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రమే ఎస్ సరస్వతి. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ఆమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 3న ఎస్ సరస్వతి ఓటీటీలోకి వచ్చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}ఎస్ సరస్వతి: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో, ప్రియమణి కీ రూల్ చేసిన తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రమే ఎస్ సరస్వతి. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ఆమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 3న ఎస్ సరస్వతి ఓటీటీలోకి వచ్చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}యుఫోరియా: ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో ధురంధర్ భామ సారా అర్జున్, భూమిక నటించిన సినిమా యుఫోరియా. ఇది ఒక తెలుగు సోషల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. సమాజంలోని కొన్ని సున్నితమైన అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీలో చూపించారు. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 2న యుఫోరియా రిలీజ్ అయింది.
లవ్ పాలసీ: వారాంతంలో (ఆదివారం) సరదాగా నవ్వుకోవడానికి వచ్చిన తెలుగు రొమాంటిక్ లవ్ కామెడీ క్రైమ్ డ్రామా లవ్ పాలసీ. ప్రేమ, రొమాన్స్, కొద్దిపాటి క్రైమ్ అంశాలతో కథతో తెరకెక్కిన లవ్ పాలసీ ఏప్రిల్ 5 నుంచి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మరింత ఇంట్రెస్టింగ్‌గా 4
ఇలా గత వారం (మార్చి 30 నుంచి ఏప్రిల్ 5) వరకు ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో ఆరు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవి ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రెండేసి చొప్పున ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈ ఆరింటిలో 4 తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన మృత్యుంజయ్, ఎస్ సరస్వతి, యుఫోరియా, లవ్ పాలసీ చూసేందుకు మరింత ఇంట్రెస్టింగ్‌గా, స్పెషల్‌గా ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.