ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో వచ్చిన 7 సినిమాలు- డిఫరెంట్ జోనర్లతో అన్నీ స్పెషల్- ఏది ఎక్కడ చూడాలో తెలుసా?
ఓటీటీలోకి ఇవాళ ఎన్నో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా 7 తెలుగు సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ జోనర్లతో కచ్చితంగా చూసేలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ వరకు, రవితేజ మాస్ జాతర టు ఆర్యన్ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ప్రతి వారం ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వస్తుంటాయి. కానీ, వాటిలో ఎక్కువగా ఒక ఫ్రైడే మాత్రం అధికంగా ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. అలా ఇవాళ 20 వరకు ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఏకంగా 7 సినిమాలు తెలుగు భాషలో డిఫరెంట్ జోనర్లతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ స్పెషల్ తెలుగు ఓటీటీ సినిమాలు ఏంటీ, వాటి ప్లాట్‌ఫ్లామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మాస్ జాతర ఓటీటీ
మాస్ మహారాజా రవితేజ, బ్యూటిఫుల్ శ్రీలీల జోడీగా మరోసారి నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే మాస్ జాతర. హీరో నవీన్ చంద్ర విలన్‌గా చేసిన ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో అంతంత మాత్రంగా మాస్ జాతర టాక్ తెచ్చుకుంది.
నేడు నెట్‌ఫ్లిక్స్‌లో మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం వంటి నాలుగు భాషల్లో మాస్ జాతర ఓటీటీ రిలీజ్ అయింది.
ఆర్యన్ ఓటీటీ
తమిళంలో సైకో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఆర్యన్. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్‌డీబీలో పదికి 7 రేటింగ్ అందుకున్న ఆర్యన్ మూవీకి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు.
మాస్ జాతర సినిమా లాగే ఆర్యన్ కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఇవాళ (నవంబర్ 28) డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో ఆర్యన్ ఓటీటీ రిలీజ్ అయింది.
ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ
బ్యూటిపుల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన మలయాళ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది పెట్ డిటెక్టివ్. పెంపుడు కుక్క కోసం వెతుక్కుంటూ వెళ్లి మాఫియా చేతికి చిక్కే కథగా తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీలో నేటి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడలో కూడా మూవీ అందుబాటులో ఉంది.
ప్రేమిస్తున్నా-శశివదనే ఓటీటీ
తెలుగులో ఇవాళ రెండు రొమాంటిక్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవే ప్రేమిస్తున్నా, శశి వదనే. బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ప్రేమిస్తున్నా ఆహాలో ఓటీటీ రిలీజ్ అయింది. రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన శశివదనే సన్ నెక్ట్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఆన్ పావమ్ పొల్లతతు ఓటీటీ
తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా ఆన్ పావమ్ పొల్లతతు. మనిషి పాపం తనకే పెద్ద భూతం వంటిది అన్న అర్థం వస్తుంది. ఐఎమ్‌డీబీలో పదికి 7.2 రేటింగ్ సాధించిన ఆన్ పావమ్ పొల్లతతు జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మొత్తంగా 5 భాషల్లో ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
పాంచ్ మినార్ ఓటీటీ
ఓటీటీలోకి ఇవాళ ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు సినిమా పాంచ్ మినార్. క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, రాశి సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. కేవలం వారం రోజుల్లోనే ఇవాళ పాంచ్ మినార్ ఓటీటీ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో పాంచ్ మినార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


