Must Watch OTT Telugu Movies This Week: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ ప్రియులు ఓటీటీల వైపు చూపులు చూస్తుంటారు. డిజిటల్ వీక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సైతం కొత్త చిత్రాలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే కామెడీ, రొమాన్స్, యాక్షన్ అంశాలతో కూడిన మూడు తెలుగు చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. విభిన్న కథాంశాలతో రూపొందిన ఆ 3 తెలుగు స్ట్రయిట్ సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.
మహాత్మా గాంధీ వాచ్ చుట్టూ తిరిగే కథతో 'బా బా బ్లాక్ షీప్'

యంగ్ యాక్టర్స్ అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బా బా బ్లాక్ షీప్'. గుణి మంచికంటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ క్రైమ్ డ్రామా నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మేఘాలయ అందాల నేపథ్యంలో సాగే ఈ కథలో కార్పొరేట్ శత్రుత్వాలు, మహాత్మా గాంధీకి చెందిన ఒక అరుదైన పాకెట్ వాచ్ ఉన్న పెట్టె చుట్టూ డ్రామా నడుస్తుంది.
పెళ్లికి మరో 24 గంటల సమయం మాత్రమే ఉందనగా, పెళ్లికొడుకు అతడి స్నేహితుడు ప్రమాదవశాత్తు ఆ విలువైల పెట్టెను కనిపెడతారు. దాంతో ఆ నిమిషం నుంచి అనేక నవ్వు తెప్పించే పొరపాట్లు, ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉపేంద్ర లిమాయే, మాల్వి మల్హోత్రా, తిన్ను ఆనంద్, జార్జ్ మరియన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు.
ప్రేమాభిమానాల కలబోతగా 'బాలు గీత'
సందీప్ సరోజ్, కేయూరి షా జంటగా నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'బాలు గీత'. ప్రతాప్ కొల్లారెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 5న 'ఈటీవీ విన్' ప్లాట్‌ఫారమ్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. సొంత భయాలు, కుటుంబ ఆకాంక్షలు, ప్రేమ-పెళ్లిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్న బాలు, గీత అనే ఇద్దరు వ్యక్తుల పరిచయం ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది అనే పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది.
వీరిద్దరి ప్రయాణంలో ఎదురయ్యే సరదా సంఘటనలు, ఎమోషనల్ ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హాస్య నటుడు కృష్ణుడు, యశోర, రిత్విక్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అనకాపల్లి'
{{/usCountry}}వీరిద్దరి ప్రయాణంలో ఎదురయ్యే సరదా సంఘటనలు, ఎమోషనల్ ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హాస్య నటుడు కృష్ణుడు, యశోర, రిత్విక్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అనకాపల్లి'
{{/usCountry}}విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ఠ జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా 'అనకాపల్లి'. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 3 నుంచే 'సన్ నెక్ట్స్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అధికారం, గుర్తింపు కోసం ఒక స్థానిక నాయకుడి ముఠాలో చేరిన ఒక యువకుడి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ప్రేమలో పడిన తర్వాత ఆ అరాచక ప్రపంచాన్ని వదిలేసి ప్రశాంతమైన జీవితం గడపాలని భావించిన ఆ యువకుడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతడు ఎలా పోరాడాడు? అనేది ఈ సినిమా సారాంశం. తారక్ పొన్నప్ప, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
ఒకేదాంట్లో 2 స్ట్రీమింగ్
ఈ వారం ఓటీటీల్లో విభిన్న జోనర్లకు చెందిన సినిమాలు అందుబాటులోకి రావడంతో వీకెండ్ వినోదానికి లోటు లేకుండా పోయింది. ఈ మూడింట్లో రెండు ఒకే ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవడం విశేషం. కామెడీ, లవ్, యాక్షన్ జోనర్లను ఇష్టపడే వీక్షకులు తమ ప్రాధాన్యతను బట్టి ఈ చిత్రాలను వీక్షించవచ్చు.