...
...
Next Story

ధనుష్, కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' బాక్సాఫీస్ రచ్చ.. 150 కోట్ల కలెక్షన్స్ దాటి అదరహో!

ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్, కృతి సనన్ నటించిన 'తేరే ఇష్క్ మే' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన 13 రోజుల్లోనే ఈ రొమాంటిక్ డ్రామా రూ. 152.01 కోట్ల మార్క్‌ను దాటేసింది. మరి తేరే ఇష్క్ మే ఇండియా కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.

Published on: Dec 11, 2025, 15:02:33 IST
Advertisement

బాలీవుడ్‌లో రొమాంటిక్ చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం 'తేరే ఇష్క్ మే'. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించారు. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించిన వసూళ్లతో దూసుకుపోతోంది.

ధురంధర్ పోటీ తట్టుకుని

ధనుష్, కృతి సనన్ 'తేరే ఇష్క్ మే'  బాక్సాఫీస్ రచ్చ.. 150 కోట్ల కలెక్షన్స్ దాటి అదరహో!
ధనుష్, కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' బాక్సాఫీస్ రచ్చ.. 150 కోట్ల కలెక్షన్స్ దాటి అదరహో!

తెరే ఇష్క్ మే సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' వంటి భారీ పోటీని సైతం తట్టుకుని తన వసూళ్ల ప్రభావాన్ని కొనసాగిస్తోంది. తాజాగా, ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈ తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ లెక్కలను అధికారికంగా ప్రకటించింది.

150 కోట్లు దాటిన తేరే ఇష్క్ మే

ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా తేరే ఇష్క్ మే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్క్‌ను దాటిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. వరల్డ్ వైడ్‌గా 13 రోజుల్లో తేరే ఇష్క్ మే రూ. 152.01 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా నిర్మాణ సంస్థ కలర్ యెల్లో మూవీస్ (Colour Yellow Movies) తెలిపింది.

ట్విటర్‌లో పోస్ట్

తమ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా గురువారం (డిసెంబర్ 11) నాడు తేరే ఇష్క్ మే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బాక్సాఫీస్ వసూళ్లను పంచుకుంది కలర్ యెల్లో మూవీస్. ఇక సక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం తేరే ఇష్క్ మే సినిమాకు ఇండియాలో ఎప్పుడో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది.

27.27 శాతం తగ్గిన కలెక్షన్స్

కానీ, 13 రోజుల్లో భారతదేశవ్యాప్తంగా తేరే ఇష్క్ మే సినిమాకు రూ. 107.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ వసూళ్లలో హిందీ నుంచి 101.6 కోట్లు ఉంటే తమిళం ద్వారా 5.55 కోట్లు వచ్చినట్లుగా సక్నిల్క్ పేర్కొంది.

ఎక్కువగా 19 కోట్లు

ఈ క్రమంలోనే తేరే ఇష్క్ మే సినిమా విడుదలైన 14వ రోజు అంటే ఇవాళ (డిసెంబర్ 12) మధ్యాహ్నం 2 గంటల సమయానికి రూ. 35 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. కాగా, ఈ సినిమా అత్యధిక సింగిల్-డే కలెక్షన్ మాత్రం ఇప్పటికీ రూ. 19 కోట్లుగా ఉంది. ఇది సినిమా విడుదలైన మొదటి ఆదివారం ఈ కలెక్షన్స్ నమోదయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks