థియేటర్లలలో విడుదలైన వెంటనే ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆడియెన్స్‌కు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న (నవంబర్ 28) థియేటర్లలో విడుదలైన మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్‌పై కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది.
ధనుష్ కృతి సనన్ జంటగా

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ జంటగా నటించిన సినిమానే తేరే ఇష్క్ మే. ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇదివరకు ధనుష్‌తో రాంజానా, ఆత్రంగి రే సినిమాలను డైరెక్ట్ చేశారు ఆనంద్ ఎల్ రాయ్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు సినిమాలు బ్యూటిఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ హిట్స్‌గా పేరు తెచ్చుకున్నాయి.
పాజిటివ్ రివ్యూస్
అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్‌లో వచ్చిన తేరే ఇష్క్ మే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికితగినట్టులాగనే ట్రైలర్ కూడా ఉండటంతో క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 28న థియేటర్లలో గ్రాండ్‌గా తేరే ఇష్క్ మే సినిమా విడుదలైంది. సినిమాకు మంచి రివ్యూసే వస్తున్నాయి. పాజిటివ్ టాక్ నడుస్తోంది.
తేరే ఇష్క్ మే కలెక్షన్స్ అండ్ రేటింగ్
తొలి రోజు ఇండియాలో రూ. 16.50 కోట్ల నెట్ కలెక్షన్స్ కూడా రాబట్టింది తేరే ఇష్క్ మే సినిమా. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి పదికి 7.1 రేటింగ్ కూడా సాధించుకుంది ఈ మూవీ. ఇంత మంచి క్రేజ్ తెచ్చుకుంటోన్న నేపథ్యంలో తేరే ఇష్క్ మే ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది.
తేరే ఇష్క్ మే ఓటీటీ రైట్స్
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తేరే ఇష్క్ మే ఓటీటీ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. హిందీతోపాటు తెలుగులో కూడా ఓటీటీ ప్రీమియర్ అవనుందని టాక్. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత తేరే ఇష్క్ మే ఓటీటీ స్ట్రీమింగ్ ఉండొచ్చు.
ఓటీటీ రిలీజ్లో మార్పులు
{{/usCountry}}ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తేరే ఇష్క్ మే ఓటీటీ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. హిందీతోపాటు తెలుగులో కూడా ఓటీటీ ప్రీమియర్ అవనుందని టాక్. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత తేరే ఇష్క్ మే ఓటీటీ స్ట్రీమింగ్ ఉండొచ్చు.
ఓటీటీ రిలీజ్లో మార్పులు
{{/usCountry}}అలా కాకుంటే బాక్సాఫీస్ కలెక్షన్స్, మౌత్ టాక్ ఇతరత్రా అంశాలను బట్టి తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ విషయంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇకపోతే తేరే ఇష్క్ మే మూవీ ఒక లవ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా. యూనివర్సిటీలో థీసిస్ కోసం హీరోను హెల్ప్ అడుగుతుంది హీరోయిన్.
తేరే ఇష్క్ మే కథ
ఈ క్రమంలో హీరోయిన్‌తో ప్రేమలో పడిపోతాడు హీరో. అయితే, రీసెర్చ్ థీసిస్ ముగిసిపోయాక హీరోతో బ్రేకప్ చెప్పి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటుంది హీరోయిన్. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? హీరోయిన్ ఎందుకు బ్రేకప్ చెప్పింది? హీరో ఏమయ్యాడు? పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన హీరోయిన్ హీరోను చాలా కాలం తర్వాత ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే తేరే ఇష్క్ మే చూడాల్సిందే.