Thalapathy Vijay Jana Nayagan 6 Deleted Scenes Adding: తమిళనాడు రాజకీయాల్లో బిజీ అవుతూ నటుడిగా దళపతి విజయ్ చేసిన చివరి చిత్రం 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రాజకీయ నాయకుడిగా అడుగుపెట్టిన విజయ్ తమిళనాడు సీఎంగా పదవి చేపట్టిన తర్వాత జన నాయకుడు సినిమా థియేటర్లలో విడుదల అయి విషయం తెలిసిందే. పలు అడ్డంకులు, వాయిదాల తర్వాత జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్

ఈ నేపథ్యంలో జన నాయగన్ చిత్ర బృందం అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. థియేటర్లలో నడుస్తున్న సినిమాకు అదనంగా మరో ఆరు తొలగించిన సన్నివేశాలను (Deleted Scenes) జోడించబోతున్నట్లు మేకర్స్ తాజాగా తెలిపారు. చెన్నైలో నిర్వహించిన 'జన నాయగన్' సక్సెస్ మీట్‌లో దర్శకుడు హెచ్. వినోద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ కట్!
"సినిమా నిడివి కారణంగా ఎడిటింగ్ సమయంలో ఆరు కీలక సన్నివేశాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అందులో విజయ్ సర్ మార్కు కనిపించే రెండు ఫన్నీ సీన్లు, రెండు పవర్ ఫుల్ యాక్షన్ ఘట్టాలు, మరొక రెండు ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. వచ్చే వారం నుంచి ఈ కొత్త సన్నివేశాలను థియేటర్లలో ప్లే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని వినోద్ వివరించారు.
'భగవంత్ కేసరి' రీమేక్‌గా భారీ వసూళ్లు
ప్రొడక్షన్ హౌస్ అనుమతి రాగానే ఈ సరికొత్త వర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగులో నందమూరి బాలకృష్ణ, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చి ఘన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి ఇది అధికారిక తమిళ రీమేక్.
జన నాయగన్ నటీనటులు, కలెక్షన్స్
ఇందులో సీఎం విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా చేయగా మమితా బైజు కీలక పాత్ర పోషించింది. అలాగే, విలన్‌గా బాబీ డియోల్ ఆకట్టుకున్నారు. నాజర్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
అనిరుధ్ భావోద్వేగ నోట్
{{/usCountry}}ఇందులో సీఎం విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా చేయగా మమితా బైజు కీలక పాత్ర పోషించింది. అలాగే, విలన్‌గా బాబీ డియోల్ ఆకట్టుకున్నారు. నాజర్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
అనిరుధ్ భావోద్వేగ నోట్
{{/usCountry}}KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
అపరితమైన నమ్మకానికి
"జన నాయకుడు, లియో, బీస్ట్, మాస్టర్, కత్తి.. ఇలా విజయ్ సార్‌తో సాగిన ప్రయాణం ఎప్పటికీ మరచిపోలేనిది. నాపై ఉంచిన అపరిమితమైన నమ్మకానికి, అందించిన మధుర జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ఈ సంగీతం ఎప్పటికీ నిలిచే ఉంటుంది" అని అనిరుధ్ పేర్కొన్నారు.
దళపతి విజయ్‌తో అనిరుధ్ ఫొటో
దళపతి విజయ్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫొటోను కూడా అనిరుధ్ రవిచందర్ నెట్టింట పంచుకోవడంతో అభిమానులు దానికి విపరీతంగా లైకులు కొడుతున్నారు. మొత్తానికి మరో అదనపు 6 సీన్లతో విజయ్ అభిమానులకు మంచి గిఫ్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'జన నాయగన్' సినిమాకు అదనంగా ఎన్ని సీన్లు జోడిస్తున్నారు?
ఎడిటింగ్‌లో తీసేసిన ఆరు సీన్లను (2 కామెడీ, 2 యాక్షన్, 2 ఎమోషనల్) వచ్చే వారం నుంచి థియేటర్లలో జోడించనున్నారు.
2. 'జన నాయగన్' చిత్రం ఏ తెలుగు సినిమాకు రీమేక్?
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి ఇది తమిళ రీమేక్.
3. ఈ సినిమాకు దర్శకత్వం, సంగీతం అందించింది ఎవరు?
హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
4. 'జన నాయగన్' చిత్రంలో నటీనటులు ఎవరు?
విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.