Thank You Subbarao OTT Release Date: తెలుగు చిత్ర పరిశ్రమలో వినూత్నమైన కథాంశాలతో, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీసే దర్శకులకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. 'ఓ.. పిట్టకథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' వంటి విలక్షణమైన సినిమాలతో టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న చెందు ముద్దు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
నేరుగా ఓటీటీలోకి

చెందు ముద్దు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సరికొత్త తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థాంక్యూ సుబ్బారావు ఓటీటీలోకి నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో ‘కుర్ర ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై దినేష్ కుర్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన థాంక్యూ సుబ్బారావు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై అంచనాలను పెంచేలా క్యూరియాసిటీని రేకెత్తిస్తూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ప్యాసింజర్ ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ మిస్టరీ కథ
ఈ సినిమా కథాంశం మొత్తం ఒక ప్యాసింజర్ రైలు ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. ఊరు, పేరు, కనీసం ముఖం కూడా తెలియని ఒక అపరిచిత అమ్మాయి చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన క్రైమ్ మిస్టరీతో ఈ చిత్రాన్ని మలిచారు. రైలులో ఒక అమ్మాయి గొంతు పట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు.
అది హీరోయిన్ చూస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు ఏమైంది? చనిపోయిందా? బతికే ఉందా? ఆమె వెనుక ఉన్న రహస్యం ఏంటి? హీరో హీరోయిన్లు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనే అంశాలను దర్శకుడు చెందు ముద్దు చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఆరుగురు అమ్మాయిల హత్య
థాంక్యూ సుబ్బారావు ట్రైలర్లో ఇప్పటికే ఆరుగురుని చంపారని హీరో హీరోయిన్లతో ఒక వ్యక్తి చెబుతాడు. డ్రగ్స్‌కు బానిసలు అయిన కొంతమంది కుర్రాళ్లు రైలులో కనిపించే అమ్మాయిలను ఎత్తుకెళ్లి చంపేస్తున్నట్లుగా ఈ కథ ఉంటుందోమో అనిపిస్తోంది. కామెడీగా స్టార్ట్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా క్రైమ్ సస్పెన్స్ మిస్టరీ టర్న్ తీసుకుంటుంది.
{{/usCountry}}థాంక్యూ సుబ్బారావు ట్రైలర్లో ఇప్పటికే ఆరుగురుని చంపారని హీరో హీరోయిన్లతో ఒక వ్యక్తి చెబుతాడు. డ్రగ్స్‌కు బానిసలు అయిన కొంతమంది కుర్రాళ్లు రైలులో కనిపించే అమ్మాయిలను ఎత్తుకెళ్లి చంపేస్తున్నట్లుగా ఈ కథ ఉంటుందోమో అనిపిస్తోంది. కామెడీగా స్టార్ట్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా క్రైమ్ సస్పెన్స్ మిస్టరీ టర్న్ తీసుకుంటుంది.
{{/usCountry}}కాగా, థాంక్యూ సుబ్బారావు చిత్రంలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార హీరో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ చాలా రీఫ్రెషింగ్‌గా ఉండబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. లవ్, కామెడీ ఎలిమెంట్స్‌ను సమానంగా జోడిస్తూనే.. కథలో వచ్చే ఊహించని సస్పెన్స్, మైండ్ బెండింగ్ ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
పవర్‌ఫుల్ టెక్నికల్ టీమ్
ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పంకజ్ తొట్టాడ తన కెమెరా పనితనంతో రిచ్ విజువల్స్‌ను ఆవిష్కరించగా, డి. వెంకట్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
ఆహా ఓటీటీలో
ఇక డైరెక్ట్‌గా థాంక్యూ సుబ్బారావు ఓటీటీ రిలీజ్ కానుంది. ఆహాలో జూన్ 18 నుంచి థాంక్యూ సుబ్బారావు ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు జూన్ 18న ఆహాలో వచ్చే 'థాంక్యూ సుబ్బారావు' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానున్నట్లు తెలుస్తోంది.