ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా హాలీవుడ్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్‌లోని ‘ది కంజురింగ్’ యూనివర్స్ అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన భయం, ఆసక్తి కలగలిసి ఉంటాయి.
ఇవాళ ఓటీటీలోకి

వరల్డ్ వైడ్‌గా అంతలా ప్రజాదరణ పొందిన హారర్ ఫ్రాంచైజీ ‘ది కంజురింగ్’ సిరీస్‌లో చివరిదైన ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 13) వచ్చేసింది. గతేడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.
బడ్జెట్ అండ్ కలెక్షన్స్
కేవలం 55 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 460 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన లాస్ట్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 499 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4,200 కోట్లు) కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. హారర్ సినిమాల చరిత్రలోనే అత్యంత భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్.
వెన్నులో వణుకు పుట్టేలా
అంతేకాకుండా ఇండియాలో కూడా లాస్ట్ రైట్స్ సినిమా సినిమా రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. మిగతా సినిమాలతో పోలిస్తే మరింత హారర్ సీన్లతో, వెన్నులో వణుకు పుట్టించేలా ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ సినిమాను తెరకెక్కించారు.
ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ రిలీజ్
అలాంటి ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (ఫిబ్రవరి 13) జియో హాట్‌స్టార్‌లో ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళంతో కలిపి మొత్తంగా నాలుగు భాషల్లో ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే?
ఈ చివరి భాగంలో కూడా ఎడ్, లోరైన్ వారెన్ (పాట్రిక్ విల్సన్, వేరా ఫార్మిగా) పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లుగా కనిపిస్తారు. ఈసారి కథ 1986 నాటి పెన్సిల్వేనియాలోని ‘స్మర్ల్ ఫ్యామిలీ’ (Smurl family) చుట్టూ తిరుగుతుంది. వారి ఇంటిని పీడిస్తున్న ఒక భయంకరమైన రాకాసి దెయ్యం, ఒక పాత పురాతన అద్దానికి అనుసంధానమై ఉంటుంది.
అద్దంలో బతికే రాకాసి
{{/usCountry}}ఈ చివరి భాగంలో కూడా ఎడ్, లోరైన్ వారెన్ (పాట్రిక్ విల్సన్, వేరా ఫార్మిగా) పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లుగా కనిపిస్తారు. ఈసారి కథ 1986 నాటి పెన్సిల్వేనియాలోని ‘స్మర్ల్ ఫ్యామిలీ’ (Smurl family) చుట్టూ తిరుగుతుంది. వారి ఇంటిని పీడిస్తున్న ఒక భయంకరమైన రాకాసి దెయ్యం, ఒక పాత పురాతన అద్దానికి అనుసంధానమై ఉంటుంది.
అద్దంలో బతికే రాకాసి
{{/usCountry}}ఆ అద్దంలో ఆ రాకాసి దెయ్యం బతుకుతుంటుంది. అదే అద్దాన్ని తాకిన తర్వాత లోరైన్ వారెన్‌కు చిత్ర విచిత్రమైన భయంకర దృశ్యాలు కనిపిస్తుంటాయి. తమ రిటైర్‌మెంట్‌ను పక్కన పెట్టి, ఈ భయంకర దెయ్యం నుంచి ఆ కుటుంబాన్ని వారెన్ దంపతులు ఎలా కాపాడారు? ఆ క్రమంలో తమ కూతురు జుడీకి ఎదురైన ప్రమాదమేంటి? అనే అంశాలను దర్శకుడు మైఖేల్ చావ్స్ వెన్నులో వణుకు పుట్టేలా తెరకెక్కించారు.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఇకపోతే ది కంజూరింగ్ సిరీస్‌లో చివరి సినిమా లాస్ట్ రైట్స్ కావడంతో మూవీకి మరింత క్రేజ్ వచ్చింది. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు, థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన వాళ్లు జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీపై ఓ లుక్కేయొచ్చు.