నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోయింది. పుష్ప 2 హిట్ తర్వాత హిందీలో హారర్ కామెడీ మూవీ థామాతో అలరించింది. అనంతరం తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ తెరకెక్కింది.
రష్మిక మందన్నాకు జోడీగా

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందన్నాకు జోడీగా దీక్షిత్ శెట్టి హీరోగా చేశాడు. అలాగే, మరో బ్యూటిపుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యూయెల్ కీలక పాత్ర పోషించింది. వీరితోపాటు రావు రమేష్, రోహిణి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా నటించారు.
భారీ అంచనాలతో రిలీజ్
గీత ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలకు వ్యవహరించారు. మ్యూజిక్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదల అయింది.
యూనిక్ స్టోరీగా పేరు
అయితే, ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొన్ని వర్గాలకు మూవీ అంతగా రుచించలేదు. కానీ, యూనిక్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. కానీ, ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ పదికి 8.2 రేటింగ్ సాధించుకుంది. అంటే చాలా వరకు ఆడియెన్స్‌కు ది గర్ల్‌ఫ్రెండ్ బాగా నచ్చిందని తెలుస్తోంది.
మరో ఐదు రోజుల్లో
ఇదిలా ఉంటే, తాజాగా ఇవాళ (నవంబర్ 30) ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మరో ఐదు రోజుల్లో ఐదు భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ ప్రీమియర్ కానుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్
{{/usCountry}}ఇదిలా ఉంటే, తాజాగా ఇవాళ (నవంబర్ 30) ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మరో ఐదు రోజుల్లో ఐదు భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ ప్రీమియర్ కానుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్
{{/usCountry}}నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5 నుంచి ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నట్లు తాజాగా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.
ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రైట్స్ ధర
కాగా, ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 14 కోట్ల వరకు ఖర్చు చేసిందని సమాచారం. అలాగే, ఈ సినిమా ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి ధర పలికినట్లు టాక్.