Muhammad Ali Biopic The Greatest OTT Trailer Released: బాక్సింగ్ రింగ్‌లో మెరుపు వేగంతో పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థులను పడగొట్టడమే కాదు, రింగ్ వెలుపల తన సిద్ధాంతాలు, నమ్మకాల కోసం ప్రపంచవ్యాప్తంగా గళమెత్తిన ధీరుడు మహమ్మద్ అలీ.
సాధారణ కుటుంబంలో పుట్టి

సాధారణ కుటుంబంలో 'క్యాషియస్ క్లే'గా ప్రయాణం ప్రారంభించి ప్రపంచం గర్వించే 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'గా ఎదిగిన ఆ మహోన్నత క్రీడాకారుడు మహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తొలి అధికారిక ఓటీటీ సిరీస్ 'ది గ్రేటెస్ట్' (The Greatest). తాజాగా ది గ్రేటెస్ట్ ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సదరు ఓటీటీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహమ్మద్ అలీ జీవితంపై ఇప్పటివరకు అనేక డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. అయితే ఆయన కుటుంబం నుంచి అధికారిక అనుమతి పొంది (Authorized Scripted Series), పూర్తి నాటకీయతతో రూపొందించిన ఏకైక వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
రింగ్ లోపలా, వెలుపలా సాగిన సంచలన ప్రయాణం
అమెరికాలోని లూయిస్విల్లే ప్రాంతానికి చెందిన యువకుడు క్యాషియస్ క్లే.. ప్రపంచ బాక్సింగ్ సామ్రాజ్యాన్ని శాసించిన మహమ్మద్ అలీగా ఎలా రూపాంతరం చెందాడనేది ఈ ఓటీటీ సిరీస్ ప్రధాన కథాంశం. క్రీడా ప్రపంచంలో అతను సాధించిన అద్భుత విజయాలతో పాటు వ్యక్తిగత, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదుర్కొన్న సవాళ్లను అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.
సమాజంలో తన సొంత గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం ఒక యోధుడు చేసిన నిరంతర పోరాటమే ఈ ది గ్రేటెస్ట్ ఓటీటీ సిరీస్. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 240కి పైగా దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ది గ్రేటెస్ట్ ఓటీటీ రిలీజ్ కానుంది.
నటీనటుల ప్రతిభ, హాలీవుడ్ స్థాయి మేకింగ్
{{/usCountry}}సమాజంలో తన సొంత గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం ఒక యోధుడు చేసిన నిరంతర పోరాటమే ఈ ది గ్రేటెస్ట్ ఓటీటీ సిరీస్. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 240కి పైగా దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ది గ్రేటెస్ట్ ఓటీటీ రిలీజ్ కానుంది.
నటీనటుల ప్రతిభ, హాలీవుడ్ స్థాయి మేకింగ్
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్‌లో మహమ్మద్ అలీ (క్యాషియస్ క్లే) ప్రధాన పాత్రను నటుడు జాలెన్ బెస్ట్ పోషించారు. అలీ తండ్రి క్యాషియస్ క్లే సీనియర్ పాత్రలో ఒమారీ హార్డ్‌విక్, తల్లి ఒడెస్సా పాత్రలో డానా గౌరియర్, సోదరుడు రూడీగా కై పర్హామ్ అద్భుతంగా నటించారు.
అలీకి ఎంతగానో తోడ్పడిన బాక్సింగ్ కోచ్ ఏంజెలో డండీ పాత్రను జియోవన్నీ రిబిసి, నాటి పౌర హక్కుల నేత మాల్కం ఎక్స్ పాత్రను మైఖేల్ ఈలీ, ప్రధాన ప్రత్యర్థి బాక్సర్ సన్నీ లిస్టన్ పాత్రను అమిన్ జోసెఫ్ ధరించారు. నటీనటుల హావభావాలు, ఆ కాలం నాటి అమెరికన్ వాతావరణాన్ని రీ-క్రియేట్ చేసిన తీరు ది గ్రేటెస్ట్ ట్రైలర్లోనే ఆకట్టుకుంటోంది.
అలీ భార్య నిర్మాణంలో..
మహమ్మద్ అలీ సతీమణి లోనీ అలీ ఈ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. ప్రముఖ షోరన్నర్ బెన్ వాట్కిన్స్ ఈ సిరీస్‌ను సృష్టించి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
హాలీవుడ్ స్టార్ నటుడు మైఖేల్ బి. జోర్డాన్ (అవుట్‌లయర్ సొసైటీ), అంతర్జాతీయ సంగీత దిగ్గజం జే-జీ (షాన్ కార్టర్ - రాక్ నేషన్) కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌తో కలిసి వీరంతా భారీ వ్యయంతో ఈ సిరీస్‌ను నిర్మించారు.
ది గ్రేటెస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్
క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాకుండా, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహమ్మద్ అలీ ప్రయాణాన్ని కళ్లకు కట్టే ఈ సిరీస్ కోసం క్రీడాభిమానులతో పాటు ఓటీటీ ప్రియులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కాబట్టి, స్పోర్ట్స్, మహమ్మద్ అలీ జీవిత చరిత్ర చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ది గ్రేటెస్ట్ సిరీస్ కోసం ఎదురుచూడాల్సిందే.