...
...
Next Story

OTT Preponed: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ డ్రామా- 7 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- తెలుగుతో సహా 5 భాషల్లో రిలీజ్!

The Kerala Story 2 OTT Release: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం వచ్చేయనుంది. అదే సంచలనం సృష్టించిన 'ది కేరళ స్టోరీ 2'. అయితే, ది కేరళ స్టోరీ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వారం రోజులు ముందుకు వచ్చేసింది. ఐదు భాషల్లో ప్రేక్షకులను పలకరించనున్న ది కేరళ స్టోరీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Apr 26, 2026, 19:22:21 IST
Advertisement

The Kerala Story 2 OTT Streaming Date Preponed: గతేడాది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దానికి కొనసాగింపుగా (స్పిరిచువల్ సీక్వెల్), అదే తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ 2'.

మొదటి భాగం స్థాయిలో

ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ డ్రామా- 7 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- తెలుగుతో సహా 5 భాషల్లో రిలీజ్!
ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ డ్రామా- 7 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- తెలుగుతో సహా 5 భాషల్లో రిలీజ్!

ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించిన ది కేరళ స్టోరీ 2 సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. అయితే, మొదటి భాగం స్థాయిలో ఇది భారీ వసూళ్లను రాబట్టలేకపోయినా, వివాదాల పరంగా మాత్రం గట్టిగానే వార్తల్లో నిలిచింది.

వివాదాలు - కోర్టు స్టే

హిందీలో సోషల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ది కేరళ స్టోరీ 2 సినిమా ప్రయాణం అస్సలు సాఫీగా సాగలేదు. సినిమా విడుదలకు ముందే ట్రైలర్ ఆధారంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. మత విద్వేషాలను ప్రేరేపించేలా ఉందంటూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది.

అయితే, సుదీర్ఘ వాదనల అనంతరం స్టే తొలగించడంతో ఫిబ్రవరి చివరలో థియేటర్లలోకి వచ్చింది ది కేరళ స్టోరీ. సినిమా విడుదల తర్వాత కూడా కన్నూర్, తిరువనంతపురం వంటి నగరాల్లో ఆందోళనల కారణంగా ప్రదర్శనలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల రీత్యా మాల్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లోని సినీపోలీస్ వంటి ప్రముఖ థియేటర్లలో షోలు రద్దు చేయాల్సి వచ్చింది.

కథా నేపథ్యం ఏంటి?

"ది కేరళ స్టోరీ మొదటి భాగం కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు వసూలు చేసింది. కానీ, సీక్వెల్ ది కేరళ స్టోరీ 2 చిత్రం రూ. 30 కోట్ల వ్యయంతో రూపొంది రూ. 60 కోట్ల కలెక్షన్స్‌తోనే సరిపెట్టుకుంది" అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ది కేరళ స్టోరీ 2 ఓటీటీ రిలీజ్

ఇలాంటి ది కేరళ స్టోరీ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. జీ5లో ది కేరళ స్టోరీ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, ఇదివరకు మే 8 నుంచి జీ5లో ది కేరళ స్టోరీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, తాజాగా 7 రోజులు ముందుగానే ఓటీటీలోకి వచ్చేయనుంది ది కేరళ స్టోరీ 2 చిత్రం.

జీ5 ఓటీటీలో

అంటే, మే 1 నుంచి జీ5 ఓటీటీలో ది కేరళ స్టోరీ 2 అందుబాటులో ఉండనుంది. కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం వంటి ఐదు భాషల్లోనూ ది కేరళ స్టోరీ 2 ఓటీటీ ప్రీమియర్ కానుంది. కమర్షియల్‌గా మొదటి సినిమా రేంజ్ సక్సెస్ కాకపోయినా, ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మంచి వ్యూయర్ షిప్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks