OTT Series Thukra Ke Mera Pyaar Season 2 Trailer Released: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో రివెంజ్ డ్రామాలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది. ప్రేమ, ద్రోహం, పగ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ కథలను డిజిటల్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓటీటీ రిలీజ్ అయి భారీ వ్యూవర్‌షిప్ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'తుక్రా కే మేరా ప్యార్' (Thukra Ke Mera Pyaar).
ఓటీటీలోకి రెండో సీజన్

ఇప్పుడు ఈ ఓటీటీ సిరీస్ రెండో సీజన్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. సంచితా బసు, ధవళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లవ్ అండ్ రివెంజ్ సిరీస్ తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. సూపర్ హిట్ సాధించిన తుక్రా కే మేరా ప్యార్ సిరీస్ సీజన్ 1 తెలుగుతో సహా 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పుడు తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 కూడా తెలుగులో ఓటీటీ రిలీజ్ అవనుంది. జియో హాట్‌స్టార్‌లో తుక్రా కే మేరా ప్యార్ 2 ఓటీటీ రిలీజ్ అవనుంది. జూన్ 19 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో తుక్రా కే మేరా ప్యార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 ట్రైలర్‌ను ఇవాళ సోమవారం (జూన్ 1) రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తుక్రా కే మేరా ప్యార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు.
ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈసారి కథలో కేవలం ప్రేమే కాకుండా రాజకీయం, పవర్ గేమ్స్, అంతర్గత కుట్రలు మరింత ఎక్కువ మోతాదులో ఉండనున్నట్లు అర్థమవుతోంది. గతంలో చేసిన తప్పుల వల్ల గిల్టీ ఫీలింగ్‌తో బాధపడుతూనే, మరోవైపు హీరోయిన్‌పై ఉన్న పిచ్చితో కొట్టుమిట్టాడే కుల్దీప్ కుమార్ పాత్రలో ధవళ్ ఠాకూర్ నటన ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అనుకోకుండా పొలిటికల్ ఉచ్చులోకి చిక్కుకున్న ఒక సగటు యువకుడి పోరాటం ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది.
పవర్‌ఫుల్ పాత్రలో సంచితా బసు
{{/usCountry}}తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈసారి కథలో కేవలం ప్రేమే కాకుండా రాజకీయం, పవర్ గేమ్స్, అంతర్గత కుట్రలు మరింత ఎక్కువ మోతాదులో ఉండనున్నట్లు అర్థమవుతోంది. గతంలో చేసిన తప్పుల వల్ల గిల్టీ ఫీలింగ్‌తో బాధపడుతూనే, మరోవైపు హీరోయిన్‌పై ఉన్న పిచ్చితో కొట్టుమిట్టాడే కుల్దీప్ కుమార్ పాత్రలో ధవళ్ ఠాకూర్ నటన ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అనుకోకుండా పొలిటికల్ ఉచ్చులోకి చిక్కుకున్న ఒక సగటు యువకుడి పోరాటం ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది.
పవర్‌ఫుల్ పాత్రలో సంచితా బసు
{{/usCountry}}మరోవైపు హీరోయిన్ శాన్విక చౌహాన్ పాత్రలో సంచితా బసు మరింత పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించింది. పాత పద్ధతులను పక్కనబెట్టి, అధికార వర్గాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించే బోల్డ్ అమ్మాయిగా ఆమె కనిపిస్తోంది.
ఈ సీజన్ గురించి సంచితా బసు మాట్లాడుతూ.. "ఈసారి శాన్విక పాత్ర మానసికంగా ఎంతో బలంగా, అదే సమయంలో ఊహించని మలుపులతో సాగుతుంది. ప్రేమ, ద్రోహం మధ్య నలిగిపోయే అమ్మాయిగా నటనకు మంచి స్కోప్ దొరికింది. ఈ సీజన్‌లో ప్రతి భావోద్వేగానికి ఒక బలమైన కారణం, పర్యవసానం ఉంటాయి" అని పేర్కొంది.
గతాన్ని మోస్తూ కుల్దీప్..
హీరో ధవళ్ ఠాకూర్ కూడా తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "తన గతాన్ని మోస్తూ, ప్రపంచం తన నుంచి ఏం ఆశిస్తోంది, మనసు ఏం కోరుకుంటోంది అనే గందరగోళంలో కుల్దీప్ పాత్ర సాగుతుంది. ట్రైలర్ కేవలం ఒక చిన్న గ్లింప్స్ మాత్రమే. అసలు కథలో ఎమోషన్స్ చాలా రియలిస్టిక్‌గా, ఇంటెన్స్‌గా ఉంటాయి. మొదటి సీజన్ కంటే దీని స్కేల్ చాలా పెద్దది" అని ధవళ్ తెలిపాడు.
ఆకట్టుకున్న తొలి సీజన్
2024లో విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ మొదటి సీజన్ ఒక పేద అబ్బాయి, ధనవంతురాలైన అమ్మాయి మధ్య సాగే ప్రేమకథగా మొదలైంది. అయితే ఆ తర్వాత సమాజంలో ఉండే అంతస్తుల భేదాలు, అహంకారం, ప్రతీకారం వంటి అంశాల చుట్టూ కథ తిరిగి సూపర్ హిట్‌గా నిలిచింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
మన తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే 'ఆర్ఎక్స్ 100' తరహా ఇంటెన్స్ లవ్ అండ్ హేట్ ఎమోషన్స్ ఈ ఓటీటీ సిరీస్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 2లో అంతకంటే ఎక్కువ డ్రామా ఉండనుందని మేకర్స్ ఇస్తున్న భరోసా చూస్తుంటే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ మరోసారి వ్యూవర్ షిప్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.