OTT Horror Thriller Today: ఓటీటీలోకి ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ వేరు. ఇవాళ అంటే ఏప్రిల్ 10న 19 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయితే, అందులో నాలుగు హారర్ థ్రిల్లర్ సినిమాలు ఉండటం విశేషంగా మారింది.

ఆ నాలుగులో కూడా 3 ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా వాటిలో ఒక్కటి మాత్రమే తెలుగులో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండి విభిన్న జోనర్లలతో నేడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కనిమంగళం కొవిలకమ్ ఓటీటీ
మలయాళంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం కనిమంగళం కొవిలకమ్. హారర్ జోనర్‌కు కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాలో అజ్మల్ ఖాన్ ఏఏ, అభి క్రిష్, ముహమ్మద్ రఫి, కొట్టాయం రమేష్, శరత్ సభా నటించారు. రాజేష్ మోహన్ కథ, దర్శకత్వం వహించారు.
శ్మశానం పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ హాస్టల్‌లో దుష్ట శక్తులు, దెయ్యాలు ఉన్నాయని, ఆ హాస్టల్‌కి వెళ్లిన చనిపోతున్నారని కథలు వస్తుంటాయి. అవి విన్న కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఆ పాడుబడ్డ హాస్టల్‌లోకి వెళ్తారు. వారు ఎందుకు వెళ్లారు, అక్కడ వారు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటీ అనేదే కనిమంగళం కొవిలకమ్ సినిమా కథ.
నేడు కనిమంగళం కొవిలకమ్ ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్‌లో ఈరోజు నుంచి కనిమంగళం కొవిలకమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్ ఒక్క ఓటీటీలోనే నేడు మూడు హారర్ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో థ్రాష్, తు యా మై రెండు హారర్ ఎలిమెంట్స్ ఉండే సర్వైవల్ థ్రిల్లర్స్ కాగా మరోటి స్క్రీమ్ 7 మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.
స్క్రీమ్ 7 ఓటీటీ
{{/usCountry}}నెట్‌ఫ్లిక్స్ ఒక్క ఓటీటీలోనే నేడు మూడు హారర్ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో థ్రాష్, తు యా మై రెండు హారర్ ఎలిమెంట్స్ ఉండే సర్వైవల్ థ్రిల్లర్స్ కాగా మరోటి స్క్రీమ్ 7 మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.
స్క్రీమ్ 7 ఓటీటీ
{{/usCountry}}హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో స్క్రీమ్ సిరీస్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్‌లో దారుణమైన రక్తపాతంతోపాటు కామెడీ ఎలిమెంట్స్ కూడా చూపించారు. ఇక తాజాగా వచ్చిన స్క్రీమ్7ను స్లాషల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో నేడు స్క్రీమ్ 7 ఓటీటీ రిలీజ్ అయింది.
తు యా మై ఓటీటీ
హిందీలో తెరకెక్కిన రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమానే తు యా మై. ఇద్దరు యూట్యూబర్ కపుల్స్ ప్రేమలో పడి టూర్‌కు వెళ్తున్న క్రమంలో ఓ హోటల్‌లో మొసలి బారిన పడతారు. దాని నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నదే కథ. నెట్‌ఫ్లిక్స్‌లోనే ఇవాళ్టీ నుంచి తు యా మై ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
థ్రాష్ ఓటీటీ
థ్రాష్ మూవీ కూడా దాదాపుగా తు యా మై సినిమా తరహాలోనే ఉంటుంది. అయితే, ఇందులో భయంకరమైన షార్క్స్ బారిన పడటమే కాకుండా భీబత్సమైన తుఫాన్ దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ సిటీలో అనుకోకుండా తుఫాన్ వస్తుంది. దాంతో నగరమంతా జలమయం అవుతుంది. అదే సమయంలో సముద్రంలోని షార్క్స్ మనుషులను వేటాడుతాయి.
తెలుగులో ఒక్కటి
మరి ఆ షార్క్స్, తుఫాన్ నుంచి ఆ ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోగలిగారా లేదా అనేదే థ్రాష్ కథ. నెట్‌ఫ్లిక్స్‌లో నేడు థ్రాష్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా థ్రాష్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా నేడు నాలుగు హారర్ థ్రిల్లర్స్ ఓటీటీ రిలీజ్ కాగా థ్రాష్ ఒక్కటి తెలుగులో అందుబాటులో ఉంది.