ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వీటిలో 3 సినిమాలు ఒక్క ఓటీటీలోనే రిలీజ్ అవడం, మరో 3 తెలుగులో స్ట్రీమింగ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి ఆ 8 సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నాడు సెంటర్ ఓటీటీ

తమిళంలో స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ నాడు సెంటర్. ఎమ్ శశికుమార్, సూర్య ఎస్‌కే, సూర్య విజయ్ సేతుపతి, రెజీనా కసాండ్రా తదితరులు నటించిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ, మలయాళం వంటి 7 భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టీ (నవంబర్ 20) నుంచి నాడు సెంటర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ది రోజెస్ ఓటీటీ
ఇంగ్లీష్‌లో సెటైరికల్ డార్క్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన మూవీ ది రోజెస్. బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ నటించిన ది రోజెస్ నేటి నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
నైట్ స్విమ్ ఓటీటీ
2014లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా 2024లో తెరకెక్కిన హారర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా నైట్ స్విమ్. స్విమ్మింగ్ పూల్‌లో దెయ్యం వంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది.
ఆఫ్టర్ ది హంట్ ఓటీటీ
హాలీవుడ్ నుంచి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ఆఫ్టర్ ది హంట్. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి ఆరు భాషల్లో నేటి నుంచి ఆఫ్టర్ ది హంట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
జురాసిక్ వరల్డ్ కేయాస్ థీరి సీజన్ 4 ఓటీటీ
జురాసిక్ వరల్డ్ నుంచి వచ్చిన యానిమేటెడ్ సిరీసే కేయాస్ థీరి. ఈ సిరీస్‌లో నాలుగో సీజన్ జురాసిక్ వరల్డ్ కేయాస్ థీరి 4 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ,యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరస్ తెరకెక్కింది.
ఏ మ్యాన్ ఆన్ ది ఇన్‌సైడ్ సీజన్ 2 ఓటీటీ
{{/usCountry}}జురాసిక్ వరల్డ్ నుంచి వచ్చిన యానిమేటెడ్ సిరీసే కేయాస్ థీరి. ఈ సిరీస్‌లో నాలుగో సీజన్ జురాసిక్ వరల్డ్ కేయాస్ థీరి 4 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ,యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరస్ తెరకెక్కింది.
ఏ మ్యాన్ ఆన్ ది ఇన్‌సైడ్ సీజన్ 2 ఓటీటీ
{{/usCountry}}ఇంగ్లీష్‌లో ఇవాళ ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ ఏ మ్యాన్ ఆన్ ది ఇన్‌సైడ్ సీజన్ 2. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 20 నుంచి ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
చెఫ్ మంత్ర సీజన్ 5 ఓటీటీ
యాంకర్ సుమ కనకాల, నటుడు జీవా హోస్ట్‌లుగా రన్ చేస్తున్న తెలుగు ఫుడ్ రియాలిటీ కాంపిటీషన్ షో చెఫ్ మంత్ర. ఈ షోలో ఐదో సీజన్ నేటి నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. సెలబ్రిటీలు వచ్చి వంటలు వండుతూ ఓటీటీ ఆడియెన్స్‌కు వినోదం పంచుతారు.
మెయిన్ తేరే కుర్బాన్ ఓటీటీ
రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా సినిమాగా తెరకెక్కిన పంజాబీ లాంగ్వెజ్ చిత్రం మెయిన్ తేరే కుర్బాన్. ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ తెచ్చుకున్న మెయిన్ తేరే కుర్బాన్ చౌపల్ ఓటీటీలో ఇవాళ్టీ నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.