Nagarjuna Fitness Secrets At Age 60: టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున గురించి పరిచయం అక్కర్లేదు. 60 ఏళ్లు దాటినా ఆయనను చూస్తుంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. సాధారణంగా రిటైర్‌మెంట్ గురించి ఆలోచించే వయసులో, నాగార్జున మాత్రం కొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ ప్రయాణం, డైట్ ప్లాన్ గురించి నాగార్జున పంచుకున్న విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాలుగా పాటిస్తున్న నియమాలే తనను ఇంత ఫిట్‌గా ఉంచాయని నాగ్ పేర్కొన్నారు.
వ్యాయామమే నా మొదటి ప్రాధాన్యత
నాగార్జున దినచర్యలో వర్కవుట్ ఎంతటి ప్రాముఖ్యత ఉందో నాగార్జున మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. "ఉదయం నిద్రలేవగానే నా ఫస్ట్ ప్రయారిటీ ఎక్సర్‌సైజ్ మాత్రమే. అసలు వ్యాయామం చేయని రోజంటూ ఉండదు. వర్కవుట్ చేయలేకపోతే ఆ రోజు షూటింగ్‌కు కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుంటాను" అని నాగార్జున చెప్పారు. వారంలో కనీసం ఐదు నుంచి ఆరు రోజులు కచ్చితంగా జిమ్‌లో గడుపుతానని నాగ్ వెల్లడించారు.
ముఖ్యంగా ఆయన చేసే వర్కవుట్ సాధారణంగా ఉండదు. గంట పాటు సాగే ఈ సెషన్‌లో కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండూ ఉంటాయి. గత 30-35 ఏళ్లుగా ఒకే పద్ధతిని కొనసాగిస్తుండటమే తన శరీర ఆకృతి మారకపోవడానికి ప్రధాన కారణమని నాగార్జున విశ్లేషించారు.
డైట్‌లో పెను మార్పులు.. ఆ రెండు మానేయాల్సిందే!
వయసు పెరుగుతున్న కొద్దీ శరీర తత్వానికి అనుగుణంగా ఆహార అలవాట్లను మార్చుకోవాలని నాగార్జున సూచించారు. 30 ఏళ్లలో ఉన్నప్పుడు తిన్న ఆహారం 60 ఏళ్లలో తింటే శరీరం సహకరించదని నాగార్జున అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను ఫాలో అవుతున్న డైట్ వల్ల శరీరం చాలా తేలికగా అనిపిస్తోందని నాగ్ పేర్కొన్నారు.
ముఖ్యంగా భారతీయుల్లో వయసు పెరిగే కొద్దీ పాల ఉత్పత్తులు (డైరీ), గ్లూటెన్ (గోధుమ సంబంధిత పదార్థాలు) పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని, వాటిని దూరం పెడితే సగం ఆరోగ్య సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయని నాగ్ కీలక సూచన చేశారు. రాత్రి భోజనాన్ని 7:30 గంటల కల్లా పూర్తి చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి జీవనశైలి గాడిలో పడుతుందని ఆయన వివరించారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్..
{{/usCountry}}ముఖ్యంగా భారతీయుల్లో వయసు పెరిగే కొద్దీ పాల ఉత్పత్తులు (డైరీ), గ్లూటెన్ (గోధుమ సంబంధిత పదార్థాలు) పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని, వాటిని దూరం పెడితే సగం ఆరోగ్య సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయని నాగ్ కీలక సూచన చేశారు. రాత్రి భోజనాన్ని 7:30 గంటల కల్లా పూర్తి చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి జీవనశైలి గాడిలో పడుతుందని ఆయన వివరించారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్..
{{/usCountry}}శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా ఆరోగ్యానికి ముఖ్యమని నాగార్జున నమ్ముతారు. అందుకే ప్రతిరోజూ 12 నుంచి 14 గంటల పాటు ఉపవాసం (Intermittent Fasting) పాటిస్తారు. సాయంత్రం భోజనం ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తీసుకోరు. దీనివల్ల జీర్ణవ్యవస్థకు తగినంత రికవరీ సమయం దొరుకుతుంది.
నాగార్జున్ వీకెండ్ చిట్కాలు
అయితే, ఆయన పూర్తిగా కఠిన నియమాల్లోనే బందీగా ఉండరు. ఆదివారం వచ్చిందంటే చాలు తన మనసు కోరుకున్నది తింటారు. "నాకు చాక్లెట్లు, స్వీట్లు అంటే ఇష్టం. రోజూ కష్టపడి వ్యాయామం చేస్తున్నాను కాబట్టి, నాకు నచ్చినవి తినడంలో తప్పు లేదు. అందుకే ఆదివారం రోజున డైట్ గురించి అస్సలు ఆలోచించను" అని సరదాగా చెప్పుకొచ్చారు నాగార్జున.
మనసుకు నచ్చినవి అప్పుడప్పుడు తింటేనే డైట్ మీద విరక్తి కలగదని నాగార్జున సీక్రెట్ రివీల్ చేశారు. ఇలా తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ చెప్పారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.