తెలుగు ప్రేక్షకులకు 'పూర్ణ'గా సుపరిచితురాలైన హీరోయిన్ షమ్నా కాసిం ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూర్ణ రెండోసారి తల్లి అయింది. శనివారం (మార్చి 14) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు పూర్ణ. ఈ సంతోషకరమైన వార్తను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా పాపకు అప్పుడే పేరు కూడా ఖరారు చేశారు.
అల్లా ఇచ్చిన అపురూప కానుక!

శనివారం తెల్లవారుజామున 4:25 గంటలకు అంటే ఫజర్ ప్రార్థనల సమయంలో పాప పుట్టినట్లు హీరోయిన్ పూర్ణ తెలిపారు. "ఈ రోజు అల్లా నా జీవితంలో మరో అపురూపమైన కానుకను అందించారు. మాకు ఆడబిడ్డ పుట్టింది. పాప పుట్టిన వెంటనే తన చెవుల్లో అజాన్, ఇకామత్ పఠించాము" అని పూర్ణ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తమ గారాల పట్టికి 'దువా జమీలా' అని పేరు పెట్టినట్లు పూర్ణ వెల్లడించారు. "మా కుమార్తె ఆయురారోగ్యాలతో, మంచి వ్యక్తిగా ఎదగాలని, మా కుటుంబానికి ఆశీర్వాదంగా నిలవాలని కోరుకుంటున్నాను" అని హీరోయిన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన భర్త షానిద్ ఆసిఫ్ అలీ, కుమారుడు హమ్దాన్‌తో కలిసి ఉన్న క్యూట్ ఫోటోను షేర్ చేశారు.
వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన భర్త షానిద్
పూర్ణ భర్త, దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీ కూడా ఈ సంతోషాన్ని పంచుకుంటూ అల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. "ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరిగినందుకు సంతోషంగా ఉంది. మా కుమారుడు హమ్దాన్‌కు ఒక చిన్న చెల్లెలు తోడైంది" అని పూర్ణ భర్త షానిద్ ఆసిఫ్ అలీ పేర్కొన్నారు. అలాగే తమకు అండగా నిలిచిన వైద్య బృందానికి, ఆస్టర్ హాస్పిటల్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పూర్ణ సినీ ప్రస్థానం
ఇకపోతే కేరళకు చెందిన పూర్ణ 2004లో మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో 'శ్రీ మహాలక్ష్మి'తో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అల్లరి నరేష్ సీమ టపాకాయ్ సినిమాలో హీరోయిన్గా అలరించిన పూర్ణ అవును, అవును 2, సుందరి వంటి సినిమాలతో అట్రాక్ట్ చేసింది.
చివరిగా బాలకృష్ణ మూవీలో
{{/usCountry}}ఇకపోతే కేరళకు చెందిన పూర్ణ 2004లో మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో 'శ్రీ మహాలక్ష్మి'తో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అల్లరి నరేష్ సీమ టపాకాయ్ సినిమాలో హీరోయిన్గా అలరించిన పూర్ణ అవును, అవును 2, సుందరి వంటి సినిమాలతో అట్రాక్ట్ చేసింది.
చివరిగా బాలకృష్ణ మూవీలో
{{/usCountry}}సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌తో అలరించిన పూర్ణ చివరగా బాలకృష్ణ 'అఖండ 2: తాండవం'లో కనిపించారు. అలాగే, తెలుగు బుల్లితెరపై పలు టీవీ షోలలో కూడా పూర్ణ న్యాయ నిర్ణేతగా కనిపించి సందడి చేశారు.
సోషల్ మీడియాలో శుభాకాంక్షలు
2022 అక్టోబర్‌లో షానిద్‌ను వివాహం చేసుకున్న పూర్ణకు 2023 ఏప్రిల్‌లో మొదటి సంతానంగా కుమారుడు హమ్దాన్ జన్మించారు. ఇప్పుడు ఆడబిడ్డ పుట్టడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.